Ashes Test: 1 పరుగు తేడాతో సెంచరీ మిస్‌ చేసుకున్న ఎల్లీస్ పెర్రీ

Ashes Test: 1 పరుగు తేడాతో సెంచరీ మిస్‌ చేసుకున్న ఎల్లీస్ పెర్రీ

ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న మహిళల యాషెస్ సిరీస్ తొలి మ్యాచ్‌లో తొలిరోజు మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 7 వికెట్లకు 328 పరుగులు చేసి భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌ఉమెన్ ఎల్లీస్ పెర్రీ 99 పరుగులకు ఔటై, 1 పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకుంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 71 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసింది.

ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 83 పరుగులకే ఓపెనర్లిద్దరిని కోల్పోయింది. ఈ సమయంలో బ్యాటింగ్‌కి వచ్చిన ఎల్లీస్ పెర్రీ, టీ.మెక్‌గ్రాత్‌తో కలిసి వికెట్ కాపాడుకుంటూ 119 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని స్పిన్నర్ సోఫీ ఎక్సెల్‌స్టోన్, టీ. మెక్‌గ్రాత్‌ని ఔట్ చేసి విడదీసింది. 14 ఓవర్ల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయి 238-6 తో ఆస్ట్రేలియా జట్లు కష్టాల్లో పడింది. ఎల్లీస్ పెర్రీ ఈ దశలో పట్టువదలకుండా ఆడుతూ స్కోర్‌బోర్డ్ పెంచే యత్నం చేసింది.

99 పరుగుల వద్ద ఫైలర్ ఓవర్లో బంతిని గల్లీ దిశగా తరలించబోయి నాట్ స్కైవర్‌ చేతికి చిక్కడంతో మ్యాచ్ మలుపుతిరిగింది. దీంతో పెర్రీ టెస్టుల్లో తన 3వ సెంచరీ చేసే అవకాశాన్ని 1 పరుగు తేడాతో చేజార్చుకుని నిరాశగా వెనుదిరిగింది.



సెంచరీ చేజార్చుకోవడంపై పెర్రీ స్పందిస్తూ.. ఆ సమయంలో మైలురాళ్లు చేరుకోవడంపై నా దృష్టి లేదు అని చెప్పింది. సెంచరీ ఒక నంబర్ మాత్రమే. దానికి నిరాశగా ఉంది. ఆటలో ఇవన్నీ ఒక భాగమే. కానీ ఈ రోజు ఆ పరిస్థితుల్లో ఆడిన తీరు నాకు మంచి అనుభవాన్ని ఇచ్చిందని తెలిపింది.

"ఈ రోజు మొదటి మ్యాచ్‌లో ఫైలర్ బౌలింగ్ ఆకట్టుకుంది. అవసరమైన సమయంలో తన బౌలింగ్‌తో మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చింది. నేను చాలా రోజులుగా టెస్ట్ క్రికెట్‌ని ఆడుతున్నాను. బౌలింగ్‌ టీంలో కేవలం ఒక్క స్పిన్నర్‌ని తీసుకోవడం ఆశ్చర్యపరిచింది. ఇంగ్లాండ్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్‌ ప్రపంచపు అత్యుత్తమ స్పిన్నర్" అని పెర్రీ తెలిపింది.

ఆస్ట్రేలియా బ్యాట్స్‌ఉమెన్లలో ఎల్లీస్ పెర్రీ అత్యధికంగా ఎల్లీస్ పెర్రీ 99 పరుగులు చేయగా, టీ. మెక్‌గ్రాత్ 61 పరుగులు చేసింది. క్రీజులో అలనా కింగ్, సదర్లాండ్ ఉన్నారు.



Tags

Read MoreRead Less
Next Story