Virat Kohli: విరాట్‌కు సపోర్ట్‌గా పాకిస్థాన్ టీమ్ కెప్టెన్.. ట్వీట్ వైరల్..

Virat Kohli: విరాట్‌కు సపోర్ట్‌గా పాకిస్థాన్ టీమ్ కెప్టెన్.. ట్వీట్ వైరల్..
X
Virat Kohli: విరాట్ ఫామ్‌ను కోల్పోవడంతో తనపై విమర్శలు ఎక్కువయ్యాయి.

Virat Kohli: హాఫ్ సెంచరీ చేస్తే సెంచరీ చేయమన్నారు అభిమానులు. ఉన్న రికార్డులు సరిపోవు అని మరికొన్ని రికార్డులు క్రియేట్ చేయమన్నారు. రన్స్ స్లో అవుతున్నాయి ఏకంగా సిక్సర్ బాధమన్నారు. ఆ క్రికెటర్ అచ్చం వారు చెప్పినట్టే చేశాడు. కానీ హఠాత్తుగా తన ఫామ్ కోల్పోయాడు. మినిమమ్ రన్స్ కూడా చేయలేక చతికిలపడ్డాడు. అయినా కూడా మేము నీ అభిమానులమే అని కొందరు ఆ ఆటగాడి వెంట నిలబడ్డారు. ఆ ఆటగాడు మరెవరో కాదు.. విరాట్ కోహ్లీ.

అండర్ 19 క్రికెట్ టీమ్ నుండి ఇండియన్ క్రికెట్ టీమ్‌లో చోటు సంపాదించుకొని.. మెల్లగా కెప్టెన్ స్థానానికి చేరుకున్నాడు విరాట్ కోహ్లీ. తన బ్యాటింగ్ స్టైల్‌తో, యాటిట్యూడ్‌తో ఎంతోమందిని తన అభిమానులుగా మార్చుకున్నాడు. మిస్టర్ అగ్రెసివ్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నా కూడా విరాట్ అంటే చాలామందికి ఇష్టం. కానీ ఉన్నట్టుండి విరాట్ తన ఫామ్ కోల్పోయాడు. ప్రస్తుతం జరుగుతున్న ఓడిఐల్లో విరాట్ తనదైన ప్రదర్శనను చూపించలేకపోతున్నాడు.

విరాట్ ఫామ్‌ను కోల్పోవడంతో తనపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఇంకా తనను టీమ్‌లో ఎందుకు ఉండనిస్తున్నారంటూ ఓపెన్‌గా విమర్శలు చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. దీంతో ఎంతోమంది క్రికెటర్లు విరాట్‌కు సపోర్ట్‌గా నిలిచారు. ఇటీవల రోహిత్ శర్మ కూడా విరాట్ ట్రాక్ రికార్డ్ మర్చిపోలేనిది అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్‌ అజామ్‌ విరాట్‌కు సపోర్ట్‌గా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.


Tags

Next Story