Bangladesh : చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్..!

Bangladesh : బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. తొలిసారి సౌత్ఆఫ్రికా గడ్డపై ఆ జట్టును ఓడించి వన్డే సిరీస్‌ని గెలుచుకుంది. సెంచూరియన్ వేదికగా చివరిదైన మూడో వన్డేలో బంగ్లా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ఆఫ్రికా టీం 37 ఓవర్లలో కేవలం 154 పరుగులకే కుప్పకూలింది. ఆ తరవాత బ్యాటింగ్ కి దిగిన బంగ్లా టీమ్ 26.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. తమిమ్ ఇక్బాల్ (87) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
మ్యాచ్‌లో కీ రోల్ ప్లే చేసిన బౌలర్ తస్కిన్ అహ్మద్ (5/35)కి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' లభించింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే బంగ్లాదేశ్ మెయిన్ కోచ్ రసెల్ డొమింగో, బౌలింగ్ కోచ్ అలన్ డొనాల్డ్‌లు ఇద్దరూ సౌత్ఆఫ్రికాకి చెందిన వాళ్లే.
History for Bangladesh 🎉
— ICC (@ICC) March 23, 2022
They record their first-ever bilateral ODI series victory in South Africa with an emphatic nine-wicket win in the final match 👏 #SAvBAN pic.twitter.com/OJoAisR1OI
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com