Rohit Sharma: వారెవ్వా రోహిత్.. వన్డేలకు కెప్టెన్ అయ్యావుగా! ఆల్ ది బెస్ట్!

Rohit Sharma (tv5news.in)
Rohit Sharma: ఇన్నాళ్లూ క్రికెట్ లో ఏకఛత్రాధిపత్యం సాధించిన కోహ్లీకి బీసీసీఐ పెద్ద షాకే ఇచ్చింది. అదే సమయంలో వరుస విజయాలతో కెప్టెన్సీని కొత్త పుంతలు తొక్కిస్తున్న రోహిత్ శర్మకు ప్రమోషన్ కూడా ఇచ్చింది.
తొలుత టీ20లకు కెప్టెన్ అయిన రోహిత్ శర్మను.. వన్డేలకు కూడా కెప్టెన్ గా ప్రకటించింది బీసీసీఐ. టెస్టులకు మాత్రం వైస్ కెప్టెన్ గా ఉంటాడు. ఇప్పటికే తానేంటో, తన కెప్టెన్సీ ఏంటో రుచి చూపించాడు. గ్రౌండ్ లో గేమ్ ఆడాలన్నా.. గేమ్ ని ఆడించాలన్నా అది రోహిత్ కే సాధ్యం.
పైగా విన్నింగ్ స్ట్రైక్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అందుకే బీసీసీఐ మరో ఆలోచన చేయలేదు. 2022 టీ20, 2023 వన్డే ప్రపంచ కప్ లను దృష్టిలో పెట్టుకునే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ హిట్ మ్యాన్ కు ఇన్నాళ్లకైనా న్యాయం జరిగిందని ఆయన అభిమానులు తెగ సంబరపడుతున్నారు.
ఇప్పటికే కోహ్లీ గేమ్ గాడి తప్పింది. విజయాల పరంగా పెద్దగా ఇబ్బంది లేకపోయినా.. బ్యాట్ నుంచి పరుగుల వరద పారి చాలాకాలమైంది. అందుకే కెప్టెన్సీకి దూరంగా ఉండి.. బ్యాట్ కు పదును పెట్టాలనుకున్నాడు. అదే సమయంలో రోహిత్ గేమ్ ప్లాన్ బాగోవడంతో.. బీసీసీఐ మరో ఆలోచన లేకుండా వన్డే కెప్టెన్సీ పగ్గాలను రోహిత్ కు అప్పజెప్పింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com