క్రికెట్ అభిమానులకి బీసీసీఐ గుడ్ న్యూస్?

కరోనా వలన నష్టపోయిన రంగాలలో క్రీడా రంగం కూడా ఒకటి.. కరోనా దృష్ట్యా ముందుగా ఫిక్స్ అయిన ద్వైపాక్షిక సిరీస్ లు అన్నీ రద్దు అయిపోయాయి. గత ఏడాది ఐపీఎల్ జరిగినప్పటికీ స్టేడియం లోకి అభిమానులను అనుమతించలేదు.
దీనితో ఐపీఎల్ మొత్తాన్ని టీవీలలోనే చూశారు ప్రేక్షకులు.. అయితే త్వరలో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పనుంది బీసీసీఐ.. ఫిబ్రవరి నుంచి జరగబోయే ఇండియా, ఇంగ్లండ్ సిరీస్‌కు కనీసం 50 శాతం మంది ప్రేక్షకులను స్టేడియాలకు అనుమతించాలని బీసీసీఐ భావిస్తోంది.
కరోనా దృష్ట్యా ఈ సిరీస్ మొత్తాన్ని కేవలం మూడు స్టేడియాలకే పరిమితం చేసింది బీసీసీఐ.. చెన్నై, అహ్మదాబాద్, పుణెలలో మొత్తం నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి.
కాగా, చివరిసారి గతేడాది జనవరిలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్ ను ప్రేక్షకులు స్టేడియంలో కూర్చొని చూశారు. ఆ తర్వాత ఇండియాలో మ్యాచ్ లు జరగలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com