ఐపీఎల్ పై కరోనా ఎఫెక్ట్.. ఆందోళనలో ప్రాంఛైజీలు..!

ఐపీఎల్ పై కరోనా ఎఫెక్ట్.. ఆందోళనలో ప్రాంఛైజీలు..!
ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభానికి మరో వారం రోజులు మాత్రమే ఉండగా.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో గ్రౌండ్స్ మెన్ గా పనిచేస్తున్న 8 మందికి సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. ఐపీఎల్ నిర్వహణపై ప్రభావం చూపించేలా ఉంది. ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభానికి మరో వారం రోజులు మాత్రమే ఉండగా.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో గ్రౌండ్స్ మెన్ గా పనిచేస్తున్న 8 మందికి సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో స్టేడియంలో మ్యాచుల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.

ఏప్రిల్ 10వ తేదీన చెన్నై-ఢిల్లీ మధ్య వాంఖేడేలో మ్యాచ్ జరగాల్సి ఉండగా.. ఇప్పుడు దీనిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏప్రిల్ 10 నుంచి 25 తేదీల మధ్య వాంఖేడేలో 10 మ్యాచ్ లు జరగనున్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో 19 మంది గ్రౌండ్ సిబ్బందికి పరీక్షలు చేయగా.. మార్చి 26న ముగ్గురికి పాజిటివ్ రాగా.. ఏప్రిల్ ఒకటిన మరో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది.

ఈ ఘటనతో ఐపీఎల్ ప్రాంఛైజీలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తమ బేస్ క్యాంప్ ముంబైలో ఏర్పాటు చేసుకున్నాయి. మరోవైపు మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుండడంతో ముంబైలో మ్యాచ్ లు నిర్వహించాలా? లేదా? అనే సందిగ్ధంలో బీసీబీసీఐ ఉంది. ముంబైలో జరగాల్సిన మ్యాచ్ లను ఇతర నగరాల్లో నిర్వహించేలా పునరాలోచన చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story