Ben Stokes ODI: ఓడిఐకు గుడ్ బై చెప్పనున్న స్టార్ క్రికెటర్..

Ben Stokes ODI: ఓడిఐకు గుడ్ బై చెప్పనున్న స్టార్ క్రికెటర్..
X
Ben Stokes ODI: ఇంగ్లాండ్ టీమ్‌లోని సమర్థవంతమైన ఆటగాళ్లలో ఒకరైన బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

Ben Stokes ODI: ఇంగ్లాండ్ టీమ్‌లోని సమర్థవంతమైన ఆటగాళ్లలో ఒకరైన బెన్ స్టోక్స్.. ఓడిఐ క్రికెట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన బెన్.. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు. దీంతో తన ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. 2019 వరల్డ్ కప్ సమయంలో బెన్ స్టోక్స్ ఆట మరువలేనిదని గుర్తుచేసుకుంటున్నారు.

'నేను ఇంగ్లాండ్ తరపున చివరి ఓడిఐ మ్యాచ్‌ను మంగళవారం దుర్హంలో ఆడనున్నాను. నేను ఈ ఫార్మాట్‌ నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇది నాకు కష్టమైన నిర్ణయం. నా టీమ్‌తో కలిసి ఆడే ప్రతీ నిమిషం నేను ఇష్టపడ్డాను. మా ప్రయాణం చాలా అద్భుతం. నేను నా టీమ్‌కు ఈ ఫార్మాట్‌లో పూర్తిస్థాయిలో సహకారం అందించలేకపోతున్నాను అన్న బాధకంటే నా నిర్ణయం ఏమీ బాధాకరంగా లేదు.'

'ఈ నిర్ణయం తర్వాత నేను టెస్ట్ క్రికెట్‌తో పాటు టీ20ల్లో కూడా పూర్తిస్థాయి ప్రదర్శన ఇస్తాను. ఆడిన 104 గేమ్స్‌ను నేను ఇష్టపడుతున్నాను. ఇక ఇందులో చివరి ఆటను నా సొంత గడ్డ అయిన దుర్హంలో ఆడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటిలాగానే నా ఇంగ్లాండ్ ఫ్యాన్స్ నాకు తోడుగా ఉంటారు. మీరు ప్రపంచంలోనే బెస్ట్ ఫ్యాన్స్. థాంక్స్' అని తన నిర్ణయాన్ని ప్రకటించాడు బెన్ స్టోక్స్.


Tags

Next Story