Bhanuka Rajapaksa : అభిమాన క్రికెటర్ కోసం రోడ్డెక్కిన ఫ్యాన్స్..!

Bhanuka Rajapaksa : అభిమాన క్రికెటర్ కోసం ఏకంగా రోడ్డెక్కారు ఫ్యాన్స్... ఈ ఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లంక జట్టులో తమ ఫేవరెట్ క్రికెటర్ భానుక రాజపక్సకు చోటు కల్పించకపోవడంతో అతని ఫ్యాన్స్ ఆగ్రహంతో రోడ్డెక్కారు. ప్లకార్డులు పట్టుకొని రోడ్డెక్కి లంక బోర్డుకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఈ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా ఫిట్‌గా లేడంటూ లంక బోర్డు రాజపక్సకి జట్టులో చోటు కలిపించలేదు.
ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభంకానున్న భారత పర్యటనలో లంక జట్టు మూడు టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. దీనికోసం లంక క్రికెట్ బోర్డు 19 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అందులో భానుక రాజపక్సకి చోటు దక్కకపోవడంతో అతని ఫ్యాన్స్ ఇలా ఆందోళనకి దిగారు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన అతనికి అక్కడ బీభత్సమైన క్రేజ్ ఉంది. శ్రీలంక తరఫున 5 వన్డేలు, 18 టీ20లు ఆడాడు రాజపక్స.
టీ20 సిరీస్ కోసం ఇరు జట్లు:
శ్రీలంక జట్టు: దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిశాంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), దినేష్ చండిమల్, దనుష్క గుణతిలక, కమిల్ మిసారా, జనిత్ లియానెగ్, చమకి కరుణరత్నే, దుష్మంత చమీర, లహిరు కుమారన్డో, షిరన్ కుమారన్డో, బినుర ఎఫ్. మహిష్ తిక్షణ, జియోఫ్రీ వండర్సే, ప్రవీణ్, జయవికారమా, ఆసియన్ డేనియల్.
టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), రీతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్.
శ్రీలంకలో భారత పర్యటన
24 ఫిబ్రవరి - 1వ T20, లక్నో
26 ఫిబ్రవరి - 2వ T20, ధర్మశాల
27 ఫిబ్రవరి - 3వ T20, ధర్మశాల
మార్చి 4-8 - 1వ టెస్టు, మొహాలి
మార్చి 12-16 - 2వ టెస్టు, బెంగళూరు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com