'యూనివర్స్ బాస్' ఏంటిది నిజమేనా.. ఐసీసీకి నచ్చలేదా? ఫ్యాన్స్‌ను హర్ట్ చేసిన గేల్!
Chirs Gayle
Chirs Gayle: వెస్టిండీస్ కీలక ప్లేయర్ క్రిస్‌గేల్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. గత కొంత కాలంగా గేల్‌ను 'యూనివర్స్ బాస్' అనే ముద్దుపేరుతో అభిమానులు పిలుచుకుంటున్నారు. క్రికెటర్లు, కామెంటేటర్లు కూడా గేల్‌ను 'యూనివర్స్ బాస్' గానే పిలిచేవారు. అయితే 'యూనివర్స్ బాస్' తాను కాదని చెప్పాడు గేల్. 'ది బాస్' మాత్రమే అని ప్రకటించాడు.
గతంలో క్రిస్‌గేల్ బ్యాట్ మీద కూడా అలా యూనివర్స్ బాస్ అనే స్టిక్కర్ ఉంటుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో బ్యాట్ మీద ది బాస్ అనే స్టిక్కర్ ఉంది. దీంతో గేల్‌ను వివరణ కోరగా.. తాను 'యూనివర్స్ బాస్'గా పిలిపించుకోవడ ఐసీసీకి ఇష్టంలేదన్నాడు. అందువల్లే దాన్ని 'ది బాస్'గా కుదించుకున్నట్లు వివరించాడు.
ఆస్ట్రేలియాతో ఆడిన మూడో టీ20లో గేల్ రెచ్చిపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. 14.5 ఓవర్లలో విండీస్ నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. గేల్ (67; 38 బంతుల్లో 4x4, 7x6) పరుగులతో విద్వంసం సృష్టించాడు. దీంతో 5 టీ20ల సిరీస్‌ను 3-0తో విండీస్ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం గేల్ బాస్ అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా కాంమెటేటర్ యూనివర్స్ బాస్‌పై ఐసీసీకి కాపీరైట్స్ ఉన్నాయా? అని గేల్‌ను ప్రశ్నించగా.. అవును. నేను కాపీరైట్ చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే క్రికెట్‌లో ఐసీసీయే బాస్. వాళ్లతో నేను పనిచేయను. ఐసీసీతో సంబంధం లేదు. బ్యాటింగ్‌లో నేనే బాస్.. అని ముగించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గేల్ అభిమానులు నిరాశచెందారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com