T20 World Cup Captain: కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఓకే.. కానీ వైస్ కెప్టెన్ విషయంలో కన్ఫ్యూజన్..

T20 World Cup Captain: కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఓకే.. కానీ వైస్ కెప్టెన్ విషయంలో కన్ఫ్యూజన్..
T20 World Cup Captain: టీమిండియాలో టీ20 వరల్డ్ కప్ వల్ల చాలా మార్పులే చోటుచేసుకుంటున్నాయి.

T20 World Cup Captain: టీమిండియాలో టీ20 వరల్డ్ కప్ వల్ల చాలా మార్పులే చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఇంటర్నేషన్ ఫార్మ్‌లో ఎక్కడా ఇండియన్ టీమ్ పాకిస్థాన్‌ప ఓడిపోయిన దాఖలాలు లేవు. కానీ ఈసారి టీ20లో ఓడిపోయింది. దీంతో ఫ్యాన్స్ అందరూ టీమిండియాపై చాలా కోపంగా ఉన్నారు. కనీసం ఆ తర్వాత మ్యాచ్ అయినా బాగా ఆడదామనుకున్నా టీమ్ అంతా కలిసి న్యూజిలాండ్‌పై సెంచరీ చేయడానికే చాలా కష్టపడింది. ఇదంతా చూసిన బీసీసీఐ.. టీమిండియాలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది.

విరాట్ కోహ్లీ.. కెప్టెన్‌గా టీమిండియాను ఎన్నో సక్సెస్‌ఫుల్ మ్యాచ్‌లను లీడ్ చేశాడు. ఎన్నోసార్లు టీమిండియా గెలుపుకు తను కారణమయ్యాడు. కానీ ఏమైందో తెలీదు.. ఉన్నట్టుండి కోహ్లీ తన ఫార్మ్‌ను కోల్పోయాడు. అయినా తన మీద అభిమానంతో ఫ్యాన్స్ అంతా తన కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూశారు. ఇదే క్రమంలో తనపై నెగిటివిటీ కూడా పెరిగిపోయింది. ఇదంతా చూసి తన కెప్టెన్సీని వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు విరాట్.

టీ20 వరల్డ్ ఈ సంవత్సరం టీమిండియాకు, టీమిండియా ఫ్యాన్స్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చింది. దీంతో ఇకపై టీ20 వరల్డ్ కప్‌లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ కాదని బీసీసీఐ నిర్ణయించింది. తన ప్లేస్‌లో రోహిత్ శర్మ పేరు దాదాపు ఖరారయ్యింది. కెప్టెన్‌ను ఖరారు చేశారు సరే కానీ మరి వైస్ కెప్టెన్ ఎవరు అనేదానిపై చర్చ ఇంకా నడుస్తూనే ఉంది. ఇదే సమయంలో మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ వైస్ కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కలిస్తే టీమిండియాను గెలుపు వైపు నడిపించగలరు. ఇప్పటికే ఈ విషయం చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. అందుకే కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌ను చేస్తే బాగుంటుందని బీసీసీఐ దాదాపు ఖరారు చేసింది. కానీ సేహ్వాగ్ దీనికి ఏ మాత్రం అంగీకరించలేనట్లుగా కనిపిస్తోంది.

రాహుల్, రిషబ్ పంత్ కంటే బుమ్రా టీ20 వైస్ కెప్టెన్‌గా సూట్ అవుతాడని సెహ్వాగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటివరకు బుమ్రా కెప్టెన్సీ వైపు వెళ్లకపోయినా.. బౌలింగ్‎లో నిలకడగా రాణిస్తున్నాడని, మూడు ఫార్మాట్లలో నిలకగా ఆడే వారినే కెప్టెన్, వైస్ కెప్టెన్‌గా నియమిస్తారు కాబట్టి బుమ్రా కంటే మెరుగైన ఎంపిక మరొకటి ఉండదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సెహ్వాగ్. ఇప్పటివరకు ఒక ఫాస్ట్ బౌలర్‌ను కెప్టెన్, వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయలేదు కాబట్టి ఇది ఒక కొత్త ప్రారంభమని ఆయన అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story