Cricket: తొలి టెస్టులో టీమిండియా జోరు..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత్ శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో భారీవిజయాన్ని ఖాతాలో వేసుకుంది. 132 పరుగుల తేడాతో కంగారులను కుదేలు చేసింది. భారత స్పిన్నర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో మొదటి టెస్టు మూడురోజుల్లోనే ముగిసింది.
గురువారం ప్రారంభం అయిన టెస్టులో, టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఈ క్రమంలో తొలిరోజే భారత పేసర్ మహ్మద్ సిరాజ్ వికెట్ తీశాడు. అనంతరం స్పిన్నర్లు జడేజా, అశ్విన్, విరుచుకు పడ్డారు. వీరికి షమీకూడా తోడవడంతో కంగారులను 177 పరుగులకే మట్టికరిపించి తొలి ఇన్నింగ్స్ ముగించారు. తరువాత క్రీస్‌లోకి దిగిన భారత ఆటగాళ్లు 223 పరుగుల తేడాతో చిత్తు చేశారు. ఇక రెండో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 17వ తేదీన ఢిల్లీలో జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com