Cricket: ఇలా చేస్తే ఇంటికి పంపేస్తా! టెండుల్కర్ డెడ్లీ వార్నింగ్

Cricket: ఇలా చేస్తే ఇంటికి పంపేస్తా! టెండుల్కర్ డెడ్లీ వార్నింగ్
సచిన్ కు చిర్రెత్తుకొచ్చిందట, యువ క్రికెటర్ పై మండిపడ్డానంటోన్న క్రికెట్ దిగ్గజం

Cricket: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సక్సెస్ సీక్రెట్ ఏంటి అని అడిగితే, ఇంకేముంది ఆయన చిత్త ప్రశాంత వదనమనే చెప్పాలి. గ్రౌండ్ లోనే కాదు, ఏ సందర్భంలోనైనా సూపర్ కూల్ గా ఉండటం అతనికే సాధ్యమైంది. అయితే ఆ మృధు స్వభావికి కూడా ఒకానొక సమయంలో చిర్రెత్తుకొచ్చిందట. ఆ కోవంలో ఓ యువ క్రికెటర్ కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చేశాడట. ఈ విషయాన్ని టెండుల్కరే స్వయంగా మీడియాతో పంచుకోవడం మరో విశేషం.


ఇన్ఫోసిస్ నిర్వహించిన ఓ ఈవెంట్ లో పాలుపంచుకున్న సచిన్ తన కెప్టెన్సీలో భారత్-ఆస్ట్రేలియా టూర్ వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆటలో భాగంగా ఓ యువ క్రికెటర్ కు ఫీల్డింగ్ బాధ్యతలు అప్పగించగా సదరు ఆటగాడు అభిమానుల కేరింతలకు ఉప్పొంగిపోయి ఆటను నిర్లక్ష్యం చేశాడట. దీంతో సింగిల్ రన్ మాత్రమే చేయగలిగే ఆ బాల్ లో బ్యాట్మన్స్ ఏకంగా రెండు పరుగులు తీసేశారు. దీంతో సచిన్ కు ఎక్కడలేని కోపం వచ్చేసిందట.


అయితే సహనాన్ని కోల్పోకుండా ఓవర్ అయిపోయిన తరువాత చిన్నగా ఆ ఆటగాడిని పిలిచి భుజం మీద చేయి వేసి ఇంకో సారి ఇలా చేస్తే తిన్నగా ఇంటికి పంపేస్తానని చెప్పాడట సచిన్. గ్రౌండ్ నుంచి హోటల్ కు కూడా తీసుకెళ్లకుండా నేరుగా భారత్ కు పంపిస్తానని వార్నింగ్ ఇచ్చాడట. అయితే తాను అతనితో ఏం మాట్లాడుతున్న సంగతి ఎవరికీ అర్ధం కాలేదని, సదరు ఆటగాడికి అది తొలి మ్యాచ్ అని సచిన్ తెలిపాడు.


భారత్ కు ఆడేటప్పుడు ఇంకేమీ గుర్తురాకూడదని, అదో అద్భుత అవకాశమని సచిన్ వివరించాడు. భారత జట్టులో ఈ స్థానం పొందటం అంత ఈజీ కాదని, ఎందరో ఆ అవకాశం కోసం ఎదురు చూస్తుంటారని, కాబట్టి దాన్ని తేలిగ్గా తీసుకోరాదని స్పష్టం చేశాడు.




Tags

Read MoreRead Less
Next Story