T20 World Cup Finals: 2015 వన్డే ప్రపంచకప్‌లో జరిగిందే రిపీట్ అవుతుందా..?

X
T20 World Cup Finals: టీ20 వరల్డ్ కప్ ఆఖరి ఘట్టానికి వేళైంది. టైటిల్ పోరులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. కివీస్ తొలిసారి పొట్టి కప్పులో తుది పోరు ఆడబోతుండగా.. ఆసీస్‌కిది రెండో ఫైనల్. దుబాయ్ వేదికగా ఇవాళ రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన కివీస్.. ఇప్పుడా జట్టుపై ప్రతీకారం తీర్చుకుని ఈ ఏడాది రెండో ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచిన విలియమ్సన్ సేన.. అదే ఊపులో పొట్టి కప్పునూ పట్టేయాలనుకుంటోంది. 2010 ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన ఆసీస్.. ఈ సారి మాత్రం ట్రోఫీని వదలకూడదనే పట్టుదలతో ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
