Cricket: న్యూజిల్యాండ్ VS భారత్
బుధవారం జరగనున్న మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం వేదిక: విరాట్ వీరంగం చేస్తాడా..?

శ్రీలంకతో జరిగిన మూడు ODI మ్యాచుల్లో భారత్ ఘణవిజయం సాధించింది. ఆదివారం తిరువనంతపురంలో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 317 పరుగుల తేడాతో విజయశంఖం పూరించింది. 166 పరుగులు చేసి నాట్‌ఔట్ గా నిలిచిన విరాట్ లంక బౌలర్లను సిక్సులు, ఫోర్లతో మెసలనివ్వకుండా మెరుపు ప్రదర్శన కనబరిచాడు.
మాంచి జోష్‌లో ఉన్న భారత ఆటగాళ్లు మరో సిరీస్‌కు సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 18 (బుధవారం) రోజున న్యూజిల్యాండ్‌తో జరగబోయే మ్యాచ్‌కు హైదరాబాద్ (RGI)ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో విరాట్ ప్రదర్శన ఎలా ఉంటుందోనని అభిమానులు ఆరాట పడుతున్నారు.
ఇప్పటికే న్యూజిల్యాండ్ ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకోగా భారత్ టీం ఈ రోజు (సోమవారం) సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్నది. మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం కలకలలాడనుంది. ఇప్పటి వరకు 20000 టికెట్లు అమ్ముడు పోయాయని HCA వెల్లడించింది. ఇదివరకు టికెట్ల విషయంలో జరిగిన దుర్ఘటనలో నలుగురు మరణించగా ఈ సారి అలాంటి సంఘటన జరగకుంటా HCA టికెట్లను ఎల్బీ స్టేడియం, ఉప్పల్ స్టేడియంతో పాటు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంచింది.