ఘనంగా క్రికెటర్‌ తుషార్‌ ఎంగేజ్‌మెంట్

ఘనంగా క్రికెటర్‌ తుషార్‌ ఎంగేజ్‌మెంట్
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు వరుసగా పెళ్లి బాజా మోగిస్తున్నారు. ఇదే నెలలో రుతురాజ్‌ గైక్వాడ్ తన ప్రియురాలు ఉత్కర్ష పవార్‌ను పెళ్లి చేసుకున్నాడు

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు వరుసగా పెళ్లి బాజా మోగిస్తున్నారు. ఇదే నెలలో రుతురాజ్‌ గైక్వాడ్ తన ప్రియురాలు ఉత్కర్ష పవార్‌ను పెళ్లి చేసుకున్నాడు. తాజాగా మరొక ఆటగాడు కూడా వివాహ బంధంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. సీఎస్‌కే పేసర్‌ తుషార్‌ దేశ్‌పాండేకు తన చిన్ననాటి స్నేహితురాలు నభా గద్దాంవార్‌తో ముంబయిలో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. ఈ ఫొటోలను దేశ్‌పాండే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్‌ టైటిల్‌ను సీఎస్‌కే గెలవడంలో దేశ్‌పాండే కూడా కీలక పాత్ర పోషించాడు. ఆ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మారాడు. మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన తుషార్‌ 21 వికెట్లు తీశాడు.

Tags

Read MoreRead Less
Next Story