ఐపీఎల్ ‌ప్రారంభమవుతున్న సమయంలో చెన్నైకి కష్టాలు

ఐపీఎల్ ‌ప్రారంభమవుతున్న సమయంలో చెన్నైకి కష్టాలు
ఐపీఎల్ ‌ప్రారంభమవుతున్న సమయంలో చెన్నైకి కష్టాలు

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ ‌ప్రారంభమవుతున్న సమయంలో చెన్నైకి కష్టాలు కలకలం రేపుతోంది. ఇద్దరు ప్లేయర్లు, మరో 11 మంది సహాయక సిబ్బందికి వైరస్‌ సోకిందని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ మెగా టోర్నీ నిర్వహణతో పాటు ఆటగాళ్ల ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

IPL కోసంఅన్ని జట్లూ UAEకి చేరుకున్నాక ఆగస్టు 20-28 తేదీల మధ్య ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి, ఆయా జట్ల యాజమాన్యాలకు అందరికీ కలిపి దాదాపు 2 వేల కరోనా టెస్టులు నిర్వహించారు. ఫలితాల్లో ఇద్దరు క్రికెటర్లు, 11 మంది సిబ్బందికి వైరస్‌ సోకిందని తేలింది..ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో ఉంచామని, ఎలాంటి కరోనా లక్షణాలు లేవని BCCI పేర్కొంది. వారిని కలిసిన ప్రైమరీ కాంటాక్టులు కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నారని చెప్పింది. అలాగే ప్రత్యేక వైద్యాధికారులను నియమించి వారికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఈ టోర్నీ జరిగే అన్ని రోజులూ పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పాటు తరచూ అందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది.

మన దేశంలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో ఈసారి IPLను UAEలో జరపాలని నిర్ణయించారు..బీసీసీఐ నిబంధనల ప్రకారం దుబాయ్‌కి బయల్దేరే 24 గంటల ముందు ఆటగాళ్లు, సిబ్బందికి రెండుసార్లు పరీక్షలు చేశారు. అప్పుడు నెగెటివ్‌ వచ్చింది కాబట్టే అందరూ విమానంలో ప్రయాణించారు. అంటే దుబాయ్‌కి చేరుకున్నాకే వీరికి వైరస్ సోకినట్టు భావిస్తున్నారు. IPL టోర్నమెంట్ 13వ అడిషన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకూ యూఏఈలో జరుగనుంది.

Tags

Read MoreRead Less
Next Story