Daryl Mitchell: ఆ ఒక్క పరుగు చేయలేదు.. మెచ్చుకొని అవార్డు ఇచ్చారు..

Daryl Mitchell (tv5news.in)
Daryl Mitchell: అదేదో సినిమాలో అల్లు అర్జున్ చెప్పినట్టు ఒక్కొక్కసారి పట్టుకోవడం కంటే వదిలేయడమే గొప్ప.. గెలవడం కంటే ఓడిపోవడమే గొప్ప.. ఇలా చేయడం వల్ల ఫలితం ఏంటో వెంటనే తెలియకపోయినా.. ఖచ్చితంగా దాని ఫలితం మాత్రం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తుంది. దానికి ఉదాహరణే న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్.
ఒక్క పరుగు వల్ల గెలిచిన ఆటలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా క్రికెట్‌లో ఒక్క పరుగు అనేది చాలా ముఖ్యం. అయినా ఆరోజు డారిల్ మిచెల్ ఆ పరుగు తీయలేదు. అలా తీయనందుకే ఈరోజు చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తూ.. ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డును గెలుచుకున్నాడు. ఇంతకీ ఆ పరుగు వెనుక కథ ఏమిటి అనుకుంటున్నారా..?
గతేడాది జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో తలబడింది న్యూజిలాండ్. ఆ సమయంలో ఫీల్డ్‌లో ఉన్న డారిల్ మిచెల్.. ఇంగ్లండ్ బౌలర్ రషీద్‌కు అడ్డుపడ్డానని భావించి పరుగు తీయకుండా ఆగిపోయాడు. ఆ ప్రవర్తనకు మెచ్చిన ఐసీసీ ఇప్పుడు తనకు ఈ అవార్డు అందజేయనుంది. ఇప్పటికీ న్యూజిలాండ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఈ అవార్డును గెలుచుకోగా.. డారిల్ అందులో నాలుగోవాడు అయ్యాడు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com