David Warner Pushpa: 'పుష్ప' సినిమాను వదలని డేవిడ్ వార్నర్.. స్పందించిన అల్లు అర్జున్..

David Warner Pushpa: ఒకప్పుడు క్రికెటర్స్ అంటే పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు కాదు.. అభిమానులతో పెద్దగా ఇంటరాక్ట్ అయ్యేవారు కాదు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. మిగతా సెలబ్రిటీలతో పోలీస్తే ప్రస్తుతం క్రికెటర్లే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ అయితే రీల్స్‌తో తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు. ఇటీవల విడుదలయిన పుష్ప సినిమాను అయితే వార్నర్ ఇప్పటికీ వదలట్లేదు.
కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో ఎంతోమంది ఎన్నో కొత్త విద్యలను నేర్చుకున్నారు. ఎన్నో ప్రయోగాలు చేశారు. చాలామంది సోషల్ మీడియాకు, రీల్స్ వంటి వాటికి అడిక్ట్ అయ్యారు. అందులో డేవిడ్ వార్నర్ కూడా ఒకరు. అందులోనూ తెలుగు సినిమాల్లోని పాటలను, డైలాగ్స్‌ను ఫ్యామిలీతో కలిసి రీల్స్ చేసి వార్నర్ క్రేజీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఇప్పటికీ తాను రీల్స్‌ను వదలకుండా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.
డేవిడ్ వార్నర్ ఎక్కువగా తెలుగు సినిమాలపైనే రీల్స్ చేస్తాడు. అలాగే పుష్ప సినిమా విడుదలయిన కొత్తలో దాని మీద రీల్స్ చేయడం ప్రారంభించాడు. అంతే కాకుండా ఫేస్ యాప్‌తో అల్లు అర్జున్ ఫేస్‌ను ఎడిట్ చేసి తానే పుష్ప రాజ్‌గా కూడా కనిపించాడు. ఇప్పుడు మరోసారి పుష్ప హిందీ డైలాగుతో అందరినీ అలరించాడు. తన కూతురితో కలిసి ఈ రీల్‌ను చేశాడు వార్నర్. ఈ వీడియోకు అల్లు అర్జున్.. ఫైర్ ఎమోజీతో కామెంట్ కూడా పెట్టాడు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com