Sciver Brunt: పెళ్లితో ఒకటైన మహిళా క్రికెటర్లు.. శుభాకాంక్షలు తెలిపిన క్రికెట్ బోర్డ్..
Sciver Brunt: ఒకప్పుడు ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటూ ఉండేవారు. కానీ ఈమధ్యకాలంలో ప్రేమకు జెండర్‌తో కూడా సంబంధం లేదు. ఇద్దరు మగవారు, ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకొని సంతోషంగా జీవిస్తున్న ఉదాహరణలు పెరిగిపోతున్నాయి. అందుకే ఈ విషయాన్ని తప్పు అనుకుంటున్న వారి మనస్థత్వం కూడా మెల్లగా మారుతోంది. తాజాగా క్రికెట్ వరల్డ్‌లోనే ఇద్దరు మహిళ ప్లేయర్స్ పెళ్లి చేసుకొని సెన్సేషన్ క్రియేట్ చేశారు.
ఇంగ్లండ్ మహిళా టీమ్ క్రికెటర్లు క్యాథరీన్ బ్రంట్, నాట్ స్కివర్ 2019లోనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. 2020 సెప్టెంబర్‌లో పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ కోవిడ్ కారణంగా పెళ్లి వాయిదా పడింది. ఇటీవల వీరిద్దరు పెళ్లితో ఒకటయ్యారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ వీరి పెళ్లికి శుభాకాంక్షలు కూడా తెలిపింది. అయితే వీరిద్దరు క్రికెట్‌లో కూడా పోటాపోటీగా ఉంటారని తెలుస్తోంది.
2017 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ విజయం సాధించినప్పుడు బ్రంట్, స్కివర్ కూడా అందులో భాగమే. స్కివర్.. ఇందులో 369 పరుగులతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఉమెన్ వరల్డ్ కప్‌లో కూడా ఈ ఇద్దరి ఆటతీరు ఇంప్రెస్ చేసేలా ఉంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో వీరిద్దరు చాలా అందంగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
England women's cricketer Katherine Brunt and Nat Sciver both got married. Many congratulations to both of them. pic.twitter.com/KatkYyWNxo
— CricketMAN2 (@ImTanujSingh) May 30, 2022
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com