Duplessis : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా డుప్లెసిస్

Duplessis : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా డుప్లెసిస్ ఎంపికయ్యాడు.. ఈ విషయాన్ని బెంగళూరులో అన్‌బాక్స్ ఈవెంట్ సందర్భంగా RCB ఫ్రాంచైజీ శనివారం వెల్లడించింది. ఇది వరకు బెంగళూరు జట్టుకు కెప్టెన్ గా ఉన్న కోహ్లీ సారధి బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కొత్త కెప్టెన్ ని ఎన్నుకోవాల్సి వచ్చింది. గత నెలలో జరిగిన IPL మెగా వేలంలో RCB జట్టు డుప్లెసిస్ ని 7 కోట్లకు తీసుకుంది. కాగా మార్చి 26 నుంచి IPL 2022 మొదలుకానుంది. సౌత్ఆఫ్రికాకి చెందిన డుప్లెసిస్ 115 మ్యాచ్ లకి కెప్టెన్ గా వ్యవహరించగా ఇందులో 81 మ్యాచ్ లలో గెలిచింది. డుప్లెసిస్ సారథ్యంలో ఆడిన 40 టీ20ల్లో దక్షిణాఫ్రికా 25 మ్యాచ్ లలో విజయం సాధించింది. 2020 ఫిబ్రవరిలో డుప్లెసిస్ సౌతాఫ్రికా అన్నీ ఫార్మాట్ల కెప్టెన్సీకి నుంచి తప్పుకున్నాడు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com