Bhubaneswar: ఒడిశాలో మొదటి ముస్లిం మహిళా ఛైర్‌పర్సన్ గుల్మాకి దల్వాజీ హబీబ్‌

Bhubaneswar: ఒడిశాలో మొదటి ముస్లిం మహిళా ఛైర్‌పర్సన్ గుల్మాకి దల్వాజీ హబీబ్‌
Bhubaneswar: మొదట్లో, నేను చాలా భయపడ్డాను. కానీ క్రమంగా అన్ని వర్గాల ప్రజలు నాకు మద్దతు ఇవ్వడం ప్రారంభించారు.

Bhubaneswar: స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గుల్మకి 3,256 ఓట్ల తేడాతో బీజేడీకి చెందిన సస్మితా మిశ్రాను ఓడించి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

ఒడిశాలోని మునిసిపాలిటీ ఎన్నికల్లో మొదటి ముస్లిం చైర్‌పర్సన్‌గా ఎన్నికైన 31 ఏళ్ల గుల్మాకి దల్వాజీ హబీబ్ రికార్డు సృష్టించారు. ఆమె బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 108 పౌర సంస్థల ఎన్నికల ఫలితాల్లో గుల్మాకి ముస్లిం సమాజం నుంచి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి గుల్మకి 3,256 ఓట్ల తేడాతో బీజేడీకి చెందిన సస్మితా మిశ్రాను ఓడించారు.

తన భర్త బీజేడీ నాయకుడిగా ఉన్నప్పటికీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన గుల్మాకి స్థానిక ప్రజల ప్రోత్సాహంతో నామినేషన్ దాఖలు చేశారు. "మొదట్లో, నేను చాలా భయపడ్డాను. కానీ క్రమంగా అన్ని వర్గాల ప్రజలు నాకు మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. తన లాంటి చదువుకున్న మహిళలు రాజకీయాల్లోకి రావలసిన అవసరం ఎంతో ఉందని నాపై నమ్మకంతో నాకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు" అని గుల్మాకి చెప్పారు.

ఒడిశా తీరంలో ఉన్న భద్రక్ పట్టణంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని ఆమె తెలిపారు. పట్టణంలోని మొత్తం జనాభాలో 59.72 శాతం హిందువులు కాగా, 39.56 శాతం ముస్లింలు, క్రైస్తవులు 0.12 శాతం, మిగిలినవారు సిక్కులు, బౌద్ధులు. జైనులు ఉన్నారు.

"వారి ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని విశ్వసించి నాపై నమ్మకంతో నాకు ఓటు వేశారని అన్నారు. తన కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలు కూడా తన కోసం ప్రచారం చేశారని ఆమె అన్నారు. 17 మంది కౌన్సిలర్‌లను గెలిపించి మెజారిటీ సాధించిన బిజెడి 30 మంది సభ్యుల మున్సిపాలిటీని ఎలా నడుపుతారని అడిగినప్పుడు, "నేను కూడా మంచి రాజకీయ నాయకురాలిని కాగలనని అనుకుంటున్నాను. కుటుంబంలోని మా మామ, అత్తలు రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. మా మేనమామ కౌన్సిలర్, మా మేనత్త చాలా సంవత్సరాల క్రితం వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు."

అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు తొలుత విముఖత వ్యక్తం చేసిన విషయాన్ని గుల్మకీని కుటుంబసభ్యులు పట్టుబట్టి ఒప్పించారు. నామినేషన్ దాఖలు చేసింది మొదలు కౌంటింగ్ రోజు వరకు వాళ్లంతా నాతో ప్రయాణించారు. వారి నమ్మకం, సహకారం నా గెలుపుకు కారణమైంది అని ఆమె చెప్పారు.

నేను ముస్లిం కుటుంబంలో పుట్టి ఉండవచ్చు, కానీ ఛైర్‌పర్సన్‌గా నేను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాను. అభివృద్ధే నా ఏకైక ఎజెండా. ఎవరి పట్లా నాకు ఎలాంటి ద్వేషభావం లేదు. నన్ను ఎన్నుకున్న హిందూ, ముస్లిం అందరి కోసం పనిచేస్తాను అని గుల్మాకీ అన్నారు. ఒడిశాలో ఇప్పటి వరకు ఏ ముస్లిం మహిళ కూడా ఏ పౌర సంస్థకు చైర్‌పర్సన్‌గా ఎన్నిక కాలేదు.

గతంలో కాంగ్రెస్ హయాంలో మత్లూబ్ అలీ, హబీబుల్లాఖాన్‌లు రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నారు. అధికార బీజేడీ కూడా మున్నా ఖాన్‌ను రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపింది. ఒడిశా జనాభాలో ముస్లింలు 3 శాతం కంటే తక్కువగా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story