RCB : ఆర్‌సీబీ కెప్టెన్ అతడే.. జోస్యం చెప్పిన కోచ్..!

RCB : 2021 ఐపీఎల్ సీజన్ తర్వాత ఆర్‌సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లుగా విరాట్ కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో తదుపరి కెప్టెన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఆర్‌సీబీ మాజీ ఆటగాడు .. ఆ జట్టు కోచ్ డేనియల్ వెటోరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ తరవాత గ్లెన్ మ్యాక్స్‌వెల్ కెప్టెన్ అయ్యే అవకాశాలున్నాయని వెటోరి అభిప్రాయపడ్డాడు.
గత సీజన్ లో మ్యాక్స్‌వెల్ అదరగొట్టాడని, ఆ సీజన్ లో జట్టు తరుపున 500కు పైగా పరుగులు సాధించాడని అన్నాడు. దీంతో మ్యాక్స్‌వెల్ కెప్టెన్ అయ్యే చాన్స్ ఉందని అన్నాడు. దీనికితోడు బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు మ్యాక్స్‌వెల్ కెప్టెన్ గా చేసిన అనుభవం కూడా ఉందని అన్నాడు. వచ్చే సీజన్‌లో అతని నాయకత్వంలో జట్టు మరింతగా రాణిస్తోందని, అంతేకాకుండా అతను ఎక్కువకాలం కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చాడు.
ఇదిలావుండగా ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు 8 జట్ల ఫ్రాంచైజీలు రిటైన్ లిస్ట్‌ను విడుదల చేశాయి. ఇందులో ఆర్‌సీబీ విషయానికి వస్తే.. విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌ను రీటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లికి అత్యధికంగా 15 కోట్లు వెచ్చించగా.. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు రూ.11 కోట్లు, మహ్మద్ సిరాజ్‌కు రూ. 7 కోట్లు వెచ్చించారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com