Happy Birth Day Tendulkar: సచిన్‌కు హాఫ్ సెంచరీ

ఇండియన్ క్రికెట్ ఐకాన్ సచిన్ రమేశ్ టెండూల్కర్ ఇవాళ 50వ వసంతంలోకి ప్రవేశించారు. క్రికెట్ అభిమానుల్లో సచిన్ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. పలు రికార్డులను తన పేరు మీద రాసుకున్నసచిన్ అభిమానులకు ఆరాధ్య దైవం.క్రికెట్ గాడ్ అని పిలుచుకునే సచిన్ టెస్టులలో అత్యధిక రన్స్, అత్యధిక సెంచరీలు తన పేరు మీద నమోదు రాసుకున్నాడు. స్టయిలీష్ స్ట్రెయిట్ డ్రైవ్ సచిన్ ఫేవరేట్ షాట్. ఎంతటి ఫాస్ట్ బౌలరైనా సచిన్‌కు బౌలింగ్ చేయాలంటే జాగ్రత్త పడాల్సిందే. క్రికెట్‌కే క్రేజ్ తెచ్చిన స్టార్ ప్లేయర్ సచిన్. 24 ఏళ్ల కెరీర్‌లో అభిమానులను అలరించి, బౌలర్లను భయపెట్టిన సచిన్… రిటైర్ అయినా క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.
ముంబైలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన సచిన్‌కు చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ప్రాణం. పదిహేనేళ్ల వయస్సులోనే 1987-88లో బాంబే స్కూల్ స్నేహితుడు వినోద్ కాంబ్లీతో కలసి వరల్డ్ రికార్డు భాగస్వామ్యంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. రంజీ, దులీప్, ఇరానీ ట్రోఫీల్లో అరంగేట్రంలోనే సెంచరీలతో అదరగొట్టాడు. జంటిల్‌మెన్ గేమ్ క్రికెట్‌కు కేరాఫ్‌గా మారాడు. ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా మారిన క్రికెట్ గ్లాడియేటర్ సచిన్ టెండూల్కర్. ఎందరో క్రికెటర్లకు ఆదర్శంగా మారిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్.
1989 నవంబర్ 16న సచిన్ కరాచీలో పాక్‌తో జరిగిన టెస్టులో ఇంటర్నేషనల్ కెరీర్ మొదలుపెట్టిన సచిన్ ..1990 ఆగస్టు 14న టెస్టుల్లో సచిన్ తొలి సెంచరీ నమోదు చేశాడు. 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో 200పరుగులు చేసి వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. 2011లో తన డ్రీమ్ అయిన వన్డే వరల్డ్ కప్ ను సగౌర్వంగా అందుకున్నాడు. 2013 నవంబర్ 16న వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో వ్యక్తిగత 200మ్యాచ్‌ను ఆడి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి దాదాపు పదేళ్లు అవుతున్నా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com