Harbhajan Singh : రిటైర్మెంట్ ప్రకటించిన హర్భజన్ సింగ్

Harbhajan Singh :  రిటైర్మెంట్ ప్రకటించిన హర్భజన్ సింగ్
Harbhajan Singh : ఇండియన్ క్రికెట్ టీం ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్నీ రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లుగా కొద్దిసేపటి క్రితం వెల్లడించాడు.

Harbhajan Singh : ఇండియన్ క్రికెట్ టీం ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్నీ రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లుగా కొద్దిసేపటి క్రితం వెల్లడించాడు. తన 23 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ థాంక్స్ చెప్పాడు. పంజాబ్‌కు చెందిన 41 ఏళ్ల హర్భజన్.. మొత్తం తన కెరీర్‌లో 103 టెస్టుల్లో కలిపి 417 వికెట్లు తీశాడు. ఇక 236 వన్డేల్లో 269 వికెట్లు, 28 టీ20ల్లో 25 వికెట్లు పడగొట్టాడు.

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున 13 సీజన్లలో ఐపిఎల్‌లో మొత్తం 163 మ్యాచ్‌లలో 150 వికెట్లు పడగొట్టాడు. 1998లో షార్జాలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ తో భారత్‌ తరుపున క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన హర్భజన్.. చివరిసారిగా మార్చి 2016లో ఢాకాలో UAEతో జరిగిన టీ20 మ్యాచ్ ఆడాడు. 2007 T20 ప్రపంచకప్ మరియు 2011 వన్డే ప్రపంచకప్ ని భారత్ గెలవడంలో హర్భజన్ కీలకపాత్ర వహించాడు.


Tags

Next Story