Harbhajan Singh : ఇంత త్వరగా వెళ్లిపోయావా మిత్రమా.. సైమండ్స్‌ హఠాన్మరణం పై హర్భజన్

Harbhajan Singh  : ఇంత త్వరగా వెళ్లిపోయావా మిత్రమా.. సైమండ్స్‌ హఠాన్మరణం పై హర్భజన్
X
Harbhajan Singh : ఆస్ట్రేలియన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ హఠాన్మరణంతో క్రికెట్‌ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది.

Harbhajan Singh : ఆస్ట్రేలియన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ హఠాన్మరణంతో క్రికెట్‌ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. ఆస్ట్రేలియాలోని ట్రాన్‌విల్లేలో నిన్న రాత్రి పదిన్నరకు జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్‌ చనిపోయాడు... వేగంగా వెళ్తున్న సమయంలో సైమండ్స్‌ కారు బోల్తా కొట్టిందని క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు తెలిపారు. సైమండ్స్‌ మృతి పట్ల యావత్‌ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. సోషల్‌మీడియా వేదికగా అభిమానులు, పలువురు క్రికెటర్లు సంతాపం ప్రకటిస్తున్నారు. అందులో భాగంగానే టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. ఇంత త్వరగా వెళ్లిపోయావా మిత్రమా అంటూ విచారం వ్యక్తం చేశాడు. సైమండ్ కుటుంబానికి, సన్నిహితులకు సానుభూతి తెలియజేశాడు. అతని ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధించాడు.

ఆండ్రూ సైమండ్స్‌ అనగానే.. హర్భజన్‌ సింగ్‌తో జరిగిన మంకీ గేట్ వివాదమే గుర్తుకొస్తుంది. 2008లో సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో హర్భజన్‌కు బౌలింగ్‌ చేస్తున్న సమయంలో సైమండ్స్‌ సీరియస్‌గా చూశాడు. ఆ సమయంలోనే తనను మంకీ అన్నాడంటూ సైమండ్స్‌ కంప్లైంట్ చేశాడు. అయితే, తాను మంకీ అనలేదు మా..కీ అన్నానంటూ హర్భజన్ చెప్పుకొచ్చాడు. నాన్‌ స్ట్రైకింగ్‌లో ఉన్న సచిన్‌ సైతం మా..కీ అనే మాట తానూ విన్నానంటూ మద్దతుగా నిలిచాడు. అయితే, క్రికెట్ ఆస్ట్రేలియా ఇవేమీ వినకుండా హర్భజన్‌పై చర్యలు తీసుకోవడంతో కెప్టెన్‌గా ఉన్న అనిల్‌ కుంబ్లే.. హర్భజన్‌పై నిషేధం ఎత్తేయకపోతే అసలు సిరీసే జరగదంటూ హెచ్చరించాడు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా దిగొచ్చింది. ఆస్ట్రేలియన్స్‌ నుంచి సైమండ్స్‌కు సపోర్ట్‌ లభించలేదు.



Tags

Next Story