Harshal Patel: ఐపీఎల్‌లో కొత్త రికార్డ్.. హర్షల్ పటేల్ ఖాతాలో..

Harshal Patel (tv5news.in)
Harshal Patel: ప్రస్తుతం క్రికెట్ లవర్స్‌లో ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఫ్యాన్స్ అంతా తమ టీమే గెలవాలి అనుకుంటూ మిస్ అవ్వకుండా మ్యాచ్‌లు చూస్తున్నారు. బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్‌సీబీ) వర్సెస్ కోలకత్తా నైట్ రైడర్స్ (కేకేఆర్) జరిగిన మ్యాచ్ ఆసక్తిగా సాగింది. ఆర్‌సీబీ మొదట్లో కాస్త స్లోగా మొదలుపెట్టిన చివరికి ఆ టీమ్‌నే విజయం వరించింది. అయితే ఈ మ్యాచ్ ద్వారా హర్షల్ పటేల్ ఖాతాలో ఓ రికార్డ్ వచ్చి చేరింది.
ఆర్‌సీబీ బౌలింగ్ ఆర్డర్ గురించి ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఐపీఎల్ 2022కు మాత్రం ఆర్‌సీబీ తమ బౌలింగ్ సామర్థ్యానికి బాగా పదునుపెట్టి రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోలకత్తా 131 పరుగులకు ఆల్ ఔట్ కాగా ఈ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే చేధించింది ఆర్‌సీబీ. అయితే ఈ మ్యాచ్‌లోనే హర్షల్ పటేల్ బౌలర్‌గా తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు మెయిడెన్ ఓవర్లు వేసిన రెండో బౌలర్‌గా హర్షల్ పటేల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంతకు ముందు ఐపీఎల్ 2020లో రెండు మెయిడెన్ ఓవర్లు వేసిన మొదటి బౌలర్‌గా మహ్మద్ సిరాజ్ ఉన్నాడు. ఇప్పుడు తన తరువాతి స్థానంలో హర్షల్ పటేల్ వచ్చి చేరాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com