Harshal Patel: హర్షల్ పటేల్ కుటుంబంలో విషాదం.. ఆర్‌సీబీ ప్లేయర్ ఇంటికి ప్రయాణం..

Harshal Patel (tv5news.in)
Harshal Patel: ఇండియన్ క్రికేటర్స్ దేశం పేరు నిలబెట్టడం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఓటమిపాలైనా ఎంతోమంది ఇండియన్స్ ప్రోత్సాహంతో గెలుపు కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. అలా దేశం కోసం ఆడే ప్రతీ క్రికెటర్.. తమ ఫ్యాన్స్‌ను ఎంతోకొంత ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటారు. తాజాగా ఓ యంగ్ క్రికెటర్ ఇంట విషాదం చోటుచేసుకున్నా కూడా ఆట పూర్తయిన తర్వాత, తన టీమ్ గెలిచిన తర్వాతే ఇంటికి ప్రయాణమయ్యాడు.
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్‌సీబీ) టీమ్‌కు చాలా క్రేజ్ ఉంది. ఇప్పటివరకు వీరి టీమ్‌కు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా దక్కకపోయినా.. వీరి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం దక్కలేదు. అయితే తాజాగా ఆర్‌సీబీ టీమ్‌లో తన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించాడు హర్షల్ పటేల్. ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు మెయిడెన్ ఓవర్లు వేసిన ఆటగాడిగా రికార్డ్ సాధించిన హర్షల్ పటేల్ ఇంట విషాదం చోటుచేసుకుంది.
శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్‌సీబీ) వర్సెస్ ముంబాయి ఇండియన్స్ (ఎంఐ) మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా రెండు వికెట్లు తీశాడు హర్షల్ పటేల్. మొత్తానికి ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌తో మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే తన సోదరి మరణించడంతో హర్షల్ పటేల్ వెంటనే ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని సమాచారం. మళ్లీ ఏప్రిల్ 14న సీఎస్‌కేతో జరగనున్న మ్యాచ్‌లో ఈ ఆర్‌సీబీ బౌలర్ పాల్గొననున్నాడట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com