Rishith Reddy : రిషిత్‌రెడ్డికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ భారీ నజరానా

Rishith Reddy : అండర్ -19 క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత యువ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అద్భుత ప్రతిభ కనబరిచి దేశం మనసు దోచిన కుర్రాళ్లకు క్రికెట్ అసోసియేషన్లు నగదు ప్రోత్సాహకాలతో వరాలు కురిపిస్తున్నాయి. విన్నింగ్ స్క్వాడ్‌లో ఉన్న హైదరాబాద్ యువతేజం రిషిత్‌రెడ్డికి... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ భారీ నజరానా ప్రకటించింది. రిషిత్‌కు 10లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు HCA ప్రెసిడెంట్ అజారుద్దీన్ తెలిపారు.
ప్రతిభావంతుడైన రిషిత్‌రెడ్డి ఉజ్వల భవిష్యత్తుకు ఈనగదు ప్రోత్సాహకం ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు. గతంలో బంగ్లాదేశ్‌తో జరిగిన అండర్-19 మ్యాచ్‌లో రిషిత్‌రెడ్డి సత్తా చాటాడు. కుడిచేతివాటం ఫాస్ట్ బౌలర్‌గా 5 వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిలో పట్టాడు. అలాగే మరికొన్ని మ్యాచ్‌ల్లోనూ అద్భుత ప్రతిబ కనబరిచి... టీమిండియాలో చోటు సంపాందించాడు. ఇప్పుడు టీమిండియా కుర్రాళ్లు కప్ సాధించడంతో వాళ్ల ఆనందానికైతే అవధుల్లేవు. విన్నింగ్ స్క్వాడ్‌లో భాగస్వామి అయిన హైదరాబాద్ యంగ్ టాలెంట్ రిషిత్‌రెడ్డిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com