ICC Test Rankings : పుజారా ఆరు..రహానె ఎనిమిది!

ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఇందులో మంచి ఫామ్ ప్రదర్శించిన భారత ఆటగాళ్లు పూజారా (760), అజింక్య రహానె (748).. ఒక్కో స్థానం మెరుగుపడి 6, 8 స్థానాల్లో నిలిచారు. విరాట్ కోహ్లీ (862) నాలుగో ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) (919), స్టీవ్ స్మిత్ (891)(AUS), లబుషేన్ (878) (AUS) వరుసగా టాప్-3లో ఉన్నారు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (823) ఐదవ స్థానాన్ని నిలుపుకున్నాడు. వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ రిషబ్ పంత్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వరుసగా 13, 18 స్థానాల్లో నిలిచారు. కాగా బౌలింగ్ విభాగంలో అశ్విన్(8), బుమ్రా(9) స్థానాల్లో కొనసాగుతుండగా.. కమిన్స్, బ్రాడ్ మొదటి రెండు ర్యాంక్‌ల్లో ఉన్నారు.
Significant changes in the latest @MRFWorldwide ICC Test Player Rankings for batting 🏏
— ICC (@ICC) January 30, 2021
Full list: https://t.co/gDnVaiQl0W pic.twitter.com/PPRDZKvuMp
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com