Ind-Wi: భారీ ఆధిక్యం దిశగా భారత్.. జైశ్వాల్ మొట్టమొదటి సెంచరీ
మొదటి టెస్ట్‌లో భారత్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. 2వ రోజు ఆట ముగిసే సమయానికి కేవలం రెండు వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసి, మొదటి ఇన్సింగ్స్‌లో 162 పరుగుల ఆధిక్యం సాధించింది. తాను ఆడుతున్న మొదటి టెస్టులోనే యశస్వి జైశ్వాల్ సెంచరీ కొట్టి రికార్డు సృష్టించాడు. కెప్టెన్ రోహిత్ కూడా సెంచరీతో రాణించాడు. క్రీజులో విరాట్ కోహ్లీ(36), జైశ్వాల్(143)లు ఉన్నారు.
2వ రోజు 80/0తో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఓపెనర్లను విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మొదటి రోజు 90 ఓవర్లు ఆడి 232 పరుగులు మాత్రమే చేశారు. మొదటి సెషన్‌లో నెమ్మదిగా ఆడిన ఓపెనర్లు, లంచ్ తర్వాత విండీస్ బౌలర్లను వేగం పెంచి బౌండరీలతో సాయంతో స్కోర్ బోర్డ్ పెంచారు. ముఖ్యంగా మొదటి టెస్ట్ ఆడుతున్న యశస్వి, అనుభవమున్న ఆటగాడిగా ఆడుతూ 215 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తర్వాత కెప్టెన్ రోహిత్ కూడా టెస్టుల్లో 10వ సెంచరీ పూర్తి చేసుకుని, తరువాత బంతికే ఔటై 103 పరుగులకే వెనుదిరిగాడు. 3వ స్థానంలో వచ్చిన మాజీ ఓపెనర్ శుభ్ మన్ గిల్ క్రీజులో ఎక్కువసేపు నిలవలేదు. దీంతో టీ బ్రేక్ సమయానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. 3వ సెషన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన విరాట్ కోహ్లీ చాలా నెమ్మదిగా ఆడాడు. అతను బౌండరీ కొట్టడానికి 81 బంతులు తీసుకోవడం విశేషం. యశస్వి, విరాట్‌లు నిలకడగా సింగిల్స్ తీయడంతో భారత్ 300 పరుగుల మార్క్ దాటింది.
రికార్డులు..
ఆసియా అవతల మొదటి వికెట్‌కు 229 పరుగుల పరుగులు జోడించి , అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా యశస్వి, రోహిత్‌లు నిలిచారు. ఇంతకు ముందు ఇంగ్లాండ్‌పై చేతన్ చౌహాన్, గవాస్కర్ జోడీలో నెలకొల్పిన 213 పరుగుల రికార్డును బద్ధలు కొట్టారు.
శిఖర్ ధావన్, పృథ్వీషాల తర్వాత అరంగేట్రం చేసిన టెస్ట్‌లో సెంచరీ కొట్టిన 3వ భారత ఓపెనర్‌గా యశస్వి జైశ్వాల్ రికార్డ్ సృష్టించాడు. మొత్తంగా ఈ ఘనత సాధించిన 17వ ఆటగాడిగా నిలిచాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా భారత్ ఆధిక్యం సాధించించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటి సారి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com