రసవత్తరంగా WTC ఫైనల్ మ్యాచ్

వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. లబుషేన్ 41 రన్స్‌తో.. గ్రీన్ 7 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 151 రన్స్‌తో తొలి ఇన్నింగ్స్ ఆట కొనసాగించిన భారత్ 296 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానే 129 బంతుల్లో 89 రన్స్,శార్దుల్ ఠాకూర్51 రన్స్ చేసి టీంను ఆదుకున్నారు.
మూడో రోజు టీమిండియా బౌలర్లు ఆసీస్‌ను నిలువరించగలిగారు.తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన కంగారూలు దానిని కొనసాగిస్తూ ఓవరాల్ ఆధిక్యాన్ని దాదాపు మూడొందలకు చేర్చారు.మిగిలిన 6 వికెట్లతో ఎన్ని పరుగులు చేసి ఎంత టార్గెట్ ఇస్తుందో చూడాలి.
మరోవైపు రహానే టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. రహానే 92 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి సెషన్‌లో ఆసీస్ బౌలింగ్‌ను ఆడుకున్న భారత బ్యాటర్ల 22 ఓవర్లలోనే ఏకంగా 4.95 రన్‌రేట్‌తో టీమిండియా 109 రన్స్ చేసింది.అయితే లంచ్ తర్వాత ఆట ఆసీస్‌వైపు తిరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com