భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య ఆఖరి టెస్టు.. ఇండియా జట్టులో ఒక మార్పు

భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య ఆఖరి టెస్టు.. ఇండియా జట్టులో ఒక మార్పు
ఇంగ్లాండ్‌తో చివరి మ్యాచ్‌ను గెలిచి ఛాంపియన్‌షిప్‌ పట్టికలో అగ్రస్థానంతో ఫైనల్‌లో అడుగు పెట్టాలని కోహ్లీసేన కోరుకుంటోంది.

ఇవాళ్టి భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య ఆఖరి టెస్టు సమరానికి రంగం సిద్ధమైంది. వారం కిందట స్పిన్నర్ల ఆధిపత్యంతో రెండు రోజుల్లోనే మ్యాచ్‌ ముగిసిన మొతేరా మైదానంలోనే చివరిదైన నాలుగో టెస్టులో ఇరు జట్లు తలపడబోతున్నాయి. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్‌.. ఈ మ్యాచ్‌ గెలిచినా, డ్రా చేసుకున్నా సిరీస్‌ సొంతమవుతుంది. దాంతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్తు బోనస్‌గా దక్కుతుంది. టీమ్‌ఇండియా ఓడితే ఆస్ట్రేలియా తుది పోరుకు అర్హత సాధిస్తుంది. ఒక బెర్తును న్యూజిలాండ్‌ ఇప్పటికే సొంతం చేసుకుంది. జూన్‌లో లార్డ్స్‌ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనుంది. అయితే ఇంగ్లాండ్‌తో చివరి మ్యాచ్‌ను గెలిచి ఛాంపియన్‌షిప్‌ పట్టికలో అగ్రస్థానంతో ఫైనల్‌లో అడుగు పెట్టాలని కోహ్లీసేన కోరుకుంటోంది. నాలుగో టెస్టుకూ స్పిన్‌ పిచ్‌నే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

సిరీస్‌లో ఆఖరి టెస్టుకు భారత్‌ ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. బుమ్రా వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో అతడి స్థానంలోకి ఉమేశ్‌ను తీసుకునే అవకాశముంది. సిరాజ్‌ కూడా పోటీలో ఉన్నప్పటికీ.. అనుభవం రీత్యా ఉమేశ్‌కే అవకాశం దక్కొచ్చు. మరోసారి భారత్‌ ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగడం ఖాయం. గత మ్యాచ్‌లో ఎక్కువగా బౌలింగ్‌ చేయకున్నా.. సుందర్‌ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగనున్నాడు. పిచ్‌ స్పిన్‌కే అనుకూలమంటున్న నేపథ్యంలో అక్షర్‌, అశ్విన్‌లపై భారీ అంచనాలున్నాయి. మూడో టెస్టులో భారత ఆటగాళ్లు బ్యాంటింగ్‌లో బాగా ఇబ్బంది పడ్డారు. ఇంగ్లాండ్‌ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్న నేపథ్యంలో భారత బ్యాట్స్‌మెన్‌ జాగ్రత్తగా ఆడాల్సిందే.Tags

Read MoreRead Less
Next Story