1000th ODI India: 1000వ ఓడీఐ.. విజయం మనదే..

1000th ODI India: చారిత్రక వెయ్యో వన్డేలో టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. అహ్మదాబాద్ వేదికగా విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 177 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమ్ఇండియా.. 28 ఓవర్లలో దానిని పూర్తి చేసింది. బ్యాటింగ్‌లో ఆరంభం నుంచే భారత్ అదరగొట్టింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్.. తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించారు.
అనంతరం 60 పరుగులు చేసిన రోహిత్ ఔటయ్యాడు. కాసేపటికే 28 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ కూడా ఫెవీలియన్ బాట పట్టాడు. ఇక క్రీజులోకి వచ్చిన కోహ్లీ, పంత్‌లు తక్కువ పరుగులకే వెనుదిరిగారు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడాలో మరో వికెట్ పడకుండా టీమిండియాకు విక్టరీ అందించారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. ప్రారంభం నుంచే వికెట్లు కోల్పోయింది. మన బౌలర్ల స్పిన్ మాయాజాలానికి చిక్కిన కరీబియన్లు.. 176 పరుగులకే ఆలౌట్ అయ్యారు. హోల్డర్ అత్యధికంగా 57 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో చాహల్ 4, సుందర్ 3, ప్రసిద్ధ్ 2, సిరాజ్ ఓ వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com