తండ్రి మృతి పట్ల హార్దిక్ పాండ్యా ఎమోషనల్ పోస్ట్!

తండ్రి మృతి పట్ల హార్దిక్ పాండ్యా ఎమోషనల్ పోస్ట్!
తన తండ్రి హిమాన్షు పాండ్యా మృతి పట్ల టీం ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో చాలా భావోద్వేగంతో స్పందించాడు. '

తన తండ్రి హిమాన్షు పాండ్యా మృతి పట్ల టీం ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో చాలా భావోద్వేగంతో స్పందించాడు. 'నువ్వు నా హీరో. నిన్ను కోల్పోవడం నా జీవితంలో కష్టంగా ఒప్పుకోవాల్సిన విషయం. ఎన్నో జ్ఞాపకాలను విడిచి.. నువ్వు వెళ్లావు. ప్రస్తుతం నీ కుమారులు ఈ స్థితిలో ఉన్నారంటే దానికి కారణం నువ్వే. నీ కష్టం వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి నా కింగ్. లవ్యూ నాన్న' అని ట్వీట్ చేశాడు పాండ్యా. కాగా, హిమాన్షు సూరత్‌లో ఒక చిన్న కార్ ఫైనాన్స్ వ్యాపారాన్ని నడుపుతుండేవాడు. కానీ తన ఇద్దరు కుమారులను మంచి క్రికెటర్లను చేయాలని కలలు కనడంతో తాను చేసే కార్ ఫైనాన్స్ వ్యాపారాన్ని వదిలి వడోదరకు వెళ్లి తన కొడుకులకు క్రికెట్‌లో శిక్షణ ఇప్పించి.. ఇద్దరిని క్రికెటర్ లను చేశారు.

Tags

Read MoreRead Less
Next Story