ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన!

ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్ తో జరగబోయే మొదటి రెండు టెస్టుల కోసం భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. కరోనా నేపద్యంలో ఈ రెండు టెస్ట్ మ్యాచ్ లు కూడా చెన్నైలో చిదంబరం స్టేడియంలోనే జరుగనున్నాయి. ఫిబ్రవరి 5-9 మధ్య తొలిటెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఉదయం 9.30గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇక రెండో టెస్ట్ మ్యాచ్ అదే స్టేడియంలో జరగగా, మూడో, నాలుగో టెస్ట్ మ్యాచ్ లు గుజరాత్ అహ్మదాబాద్‌లోని సర్ధార్ పటేల్ స్టేడియంలో జరుగనుంది. ఆ తర్వాత మార్చి 12 నుంచి టీ-20 సిరిస్ జరుగనుంది. మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌లోని సర్ధార్ పటేల్ స్టేడియంలోనే జరుగనున్నాయి. మార్చి 23న తొలివన్డే, 26న రెండోవన్డే, 28న మూడో వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచులన్నీ పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతాయి.
తొలి రెండు టెస్ట్ మ్యాచ్ లకి జట్టు వివరాలు ఇలా
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారా, శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ సుందర్, ఆక్సర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇశాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com