సీఎస్‌కే టార్గెట్ 163 పరుగులు

సీఎస్‌కే టార్గెట్ 163 పరుగులు

దుబాయ్‌ షేక్ జాయేద్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్‌లో చెన్నై జట్టు ముందు 163 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది ముంబై ఇండియన్స్. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ముంబై ఇండియన్స్ టీమ్ 162 పరుగులు చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఫస్ట్ బంతికే ఫోర్ కొట్టి అభిమానుల్లో ఊపు తీసుకొచ్చాడు. అయితే 10 బంతుల్లో 12 పరుగులు చేసి చావ్లా బౌలింగ్‌లో శామ్ కరన్‌కు క్యాచ్‌గా చిక్కి రోహిత్ పెవిలియన్ బాట పట్టాడు. ముంబై మరో ఓపెనర్ 33 పరుగులతో రాణించాడు. శామ్ కరన్ బౌలింగ్‌లో వాట్సన్‌కు క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. ఇక సౌరభ్ తివారి 42 పరుగులు చేసి.. డుప్లెసిస్‌కు క్యాచ్‌గా చిక్కి ఔటయ్యాడు. ఇక హార్థిక్ పాండ్యా వరుసగా రెండు సిక్స్‌లతో మెరిపించాడు. అయితే జడేజా బౌలింగ్‌లో ఆడుతుండగా.. డుప్లెసిస్ గాల్లో ఎగిరి మరీ క్యాచ్ పట్టడంతో 14 పరుగులతో పెవిలియన్‌కు వెళ్లక తప్పలేదు. పొలార్డ్ 18, క్రూనల్ పాండ్యా 3, జేమ్స్ పట్టిన్సన్ 11, రాహుల్ చాహర్ 2, బూమ్రా 5 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో లుంగీ ఎంగిడీకి 3 వికెట్లు, దీపక్ చాహర్ 2, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీయగా.. శామ్ కరన్, పీయూష్ చావ్లాకు చెరో వికెట్ దక్కింది.

Tags

Read MoreRead Less
Next Story