చెన్నై అపజయాల పరంపర..

చెన్నై అపజయాల పరంపర..

IPLలో చెన్నై అపజయాల పరంపర కొనసాగుతోంది. లక్ష్య చేధనలో ధోని సేన మరోసారి తడబడటంతో... రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నైను 132 పరుగులకే కట్టడి చేసింది కోహ్లిసేన . ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నాలుగు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి 90 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 170 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నై మొదటి నుంచే తడబడింది.. 42 పరుగులతో అంబటి రాయుడు ఒక్కడే రాణించగా.. మిగతా వారు విఫలమయ్యారు. ధోని కూడా 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

Tags

Read MoreRead Less
Next Story