సిక్సర్ల మోత మోగించిన రాజస్థాన్ రాయల్స్.. చెన్నైకి భారీ టార్గెట్

ఐపీఎల్-13లో భాగంగా షార్జాలో.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ సిక్సర్ల మోత మోగించింది. సీఎస్‌కే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోంది. బ్యాటింగ్ ఆరంభించిన రాజస్తాన్.. తొలిసారి రెండొందల పరుగుల మార్కును దాటింది. ఆదిలో శాంసన్ సిక్సర్లతో హోరెత్తించగా, చివర్లో ఆర్చర్ మెరుపులు మెరిపించాడు. ఎన్‌గిడి వేసిన ఆఖరి ఓవర్‌లో ఆర్చర్ వరుస సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. ఒకే ఓవర్‌లో ఆర్చర్ 4 సిక్స్‌లతో 25 పరుగులు సాధించగా, మొత్తంగా 30 పరుగులు వచ్చాయి. దాంతో రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో మొత్తం 17 సిక్స్‌లు వచ్చాయి.
రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లలో సంజు శాంసన్ 74(9 సిక్సర్లు, 1 ఫోర్), కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 69(4 ఫోర్లు, 4 సిక్సర్లు), యశస్వి జైశ్వాల్ 6, రాబిన్ ఊతప్ప 5, జోఫ్రా 27(4 సిక్సర్లు) పరుగులు చేశారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com