ఢిల్లీని చిత్తుగా ఓడించిన హైదరాబాద్‌

ఢిల్లీని చిత్తుగా ఓడించిన హైదరాబాద్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‎లో సన్ రైజర్స్ 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ జట్టు ముందు హైదరాబాద్ టీమ్ 220 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ టార్గెట్‎తో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ ధావన్ ఫస్ట్ ఓవర్లోనే డకౌట్ రూపంలో వెనుతిరిగాడు. మిడిల్‌ ఆర్డర్‌కూడా విఫలం కావడంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 131పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‎కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహాలు దూకుడుగా ఆడారు. సన్ రైజర్స్ బ్యాటింగ్‎లో సాహా 87 పరుగులు, డెవిడ్ వార్నర్ 66 పరుగులు చేశారు. దీంతో హైదరాబాద్ స్కోర్ 20 ఓవర్లలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 219 పరుగుల భారీ స్కోర్ ఢిల్లీ జట్టు ముందు నిర్ధేశించింది. సన్ రైజర్స్ బౌలింగ్‎లో.. రషీద్ ఖాన్ మూడు వికెట్లు, సందీప్ శర్మ, నటరాజన్ కు రెండు వికెట్లు తీయగా..విజయ్ శంకర్, నదీమ్, హోల్డర్‎కు తలో వికెట్ దక్కాయి.

వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసిన దిల్లీ పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. మరోవైపు వార్నర్‌సేన ఈ విజయంతో ఆరో స్థానానికి చేరింది. అయితే హైదరాబాద్‌ ప్లేఆఫ్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవడంతో పాటు ఇతర జట్ల విజయాలపై ఆధారపడి ఉంటుంది.


Tags

Read MoreRead Less
Next Story