ఐపీఎల్ ధనాధన్‌ వార్‌.. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ ధనాధన్‌ వార్‌.. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ ధనాధన్‌ వార్‌ ప్రారంభమైంది.ఈ సారి దుబాయ్‌.. షేక్ జాయేద్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్‌ స్టార్ అయింది. ఫస్ట్ మ్యాలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు, ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడనుంది.

టోర్నీలో ఎన్ని జట్లు ఉన్నా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాత్రం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఐపీఎల్‌ 12 సీజన్లు జరిగింది. నిషేధం వేటుపడ్డ రెండేళ్లను తొలగిస్తే చెన్నై 10 సార్లు ఆడింది. మూడుసార్లు విజేతగా నిలిచింది. ఏకంగా ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచింది. అంటే ఎనిమిదిసార్లు సీఎస్‌కే ఫైనల్‌ ఆడింది. ఇలాంటి రికార్డు మరే జట్టుకూ లేదు. ఇక చెన్నై జట్టులో ధోనీ(కెప్టెన్‌), మురళీ విజయ్‌, షేన్‌ వాట్సన్‌, ఫా డుప్లెసిస్‌, అంబటి రాయుడు, కేదార్‌ జాధవ్‌, సామ్‌ కరన్‌, రవీంద్ర జడేజా, పీయుష్‌ చావ్లా, దీపక్‌ చాహర్‌, లుంగి ఎంగిడి ఉన్నారు.

ఇక ముంబై ఇండియన్స్‌ ఐ.పి.ఎల్‌ రారాజుగా కొనసాగుతోంది. ఐదుసార్లు ఫైనల్‌కు వెళ్తే ఆ జట్టు నాలుగుసార్లు ట్రోఫీ సొంతం చేసుకుంది. అన్నీ రోహిత్‌ శర్మ సారథ్యంలో సాధించినవే.. లీగ్‌లో అత్యధిక మ్యాచులాడిన ఘనత ముంబయి సొంతం. 2013, 2015, 2017, 2019 సీజన్లలో టైటిల్‌ కొట్టేసింది. 2010లో రన్నరప్. ఇప్పటి వరకు ఏడుగురు ఆటగాళ్లు సారథ్యం వహించారు. అయితే అందులో రోహిత్‌ సారథ్యంలో జట్టు నాలుగుసార్లు విజేతగా నిలిచింది. ముంబయి జట్టు లో రోహిత్‌శర్మ(కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సౌరభ్‌ తివారి‌, కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, జేమ్స్‌ పాటిన్‌సన్‌‌, రాహుల్‌ చాహర్‌, ట్రెంట్‌బౌల్ట్‌, జస్ప్రీత్‌ బుమ్రా ఉన్నారు.

కాగా, చాలా మంది ఆటగాళ్లు గత కొంతకాలంగా ఆటకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ మ్యాచ్‌లో ఎలా రాణిస్తారనేది ఉత్కంఠ కల్గిస్తుంది. మరోవైపు ప్రాక్టీస్‌ సమయం తక్కువైనా ధోనీసేన ముంబయితో పోటీపడుతుడటంతో ఈ గేమ్‌పై ఆసక్తి నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story