ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఫైనల్లోకి అడుగుపెట్టిన ఢిల్లీ

ఐపీఎల్ 13వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరు ముగిసింది. టైటిల్ రేస్ నుంచి నిష్ర్కమించింది. ఫైనల్ ఎంట్రీ కోసం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం పాలైంది. 17 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో ఐపీఎల్ 13వ సీజన్ నుంచి హైదరాబాద్ జట్టు ఇంటిముఖం పట్టగా, ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ఫైనల్‌కు చేరింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, స్టోయినిస్ శుభారంభం ఇవ్వడంతో.. ఢిల్లీ భారీ స్కోర్ చేయగలిగింది. ధావన్ 78 పరుగులతో చెలరేగిపోయాడు. స్టోయినిస్ 38 రన్స్‌తో రాణించగా..హెట్‌మెయిర్ 42 పరుగులతో బ్యాట్ ఝుళిపించాడు.. దీంతో ఢిల్లీ జట్టు.. హైదరాబాద్ ముందు 190 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అనంతరం బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డేవిడ్ వార్నర్ 2పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇక ప్రియాం గార్గ్, మనీష్ పాండే కూడా విఫలం కావడంతో సన్‌రైజర్స్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత కేన్ విలియమ్స్ ,అబ్దుల్ సామద్ పోరాడినా జట్టును గట్టెంచలేకపోయారు.
అద్భుత విజయంతో ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది ఢిల్లీ. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. హైదరాబాద్ జట్టు ఓటమి క్రికెట్ అభిమానులను నిరుత్సాహ పరిచింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com