నేటినుంచి ఐపీఎల్ పండుగ

నేటినుంచి ఐపీఎల్ పండుగ
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంబరం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నేడు ప్రారంభం కానుంది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో అసలు ఉంటుందా లేదా అనుకున్న..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంబరం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నేడు ప్రారంభం కానుంది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో అసలు ఉంటుందా లేదా అనుకున్న ఐ.పి.ఎల్‌ అన్ని హర్డిల్స్‌ దాటుకుని క్రికెట్‌ ఫ్యాన్స్‌ను ఎంటర్‌ టైన్‌ చేసేందుకు సై అంటోంది. దుబాయ్‌ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభమవుతోంది. ముంబై, చెన్నై మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌కు అబు దాబి వేదికగా మారింది. సాధారణంగా సమ్మర్‌లో జరగాల్సిన ఈ ధనాధన్‌ పండుగ.. కరోనా వైరస్ కారణంగా దాదాపు 6 నెలలు ఆలస్యంగా మొదలవుతోంది. ఐపీఎల్ 2020 తొలి తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ తో టైటిల్ ఫెవరెట్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. గతంలో భారత కాలక ప్రకారం రాత్రి 8.30 గంటలకు మ్యాచ్‌లు జరిగేవి.. ఇప్పుడు వేదిక మారడంతో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. శని, ఆదివారాలు మినహా ప్రతి రోజు ఒక్క మ్యాచ్‌ మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు.

ఈసారి టోర్నీ చాలా కొత్తగా కనిపించనుంది. గతంలా ఏదీ ఉండదు.. ప్రేకక్షుల కేరింతలు.. విజుల్స్‌.. వేవ్స్‌, చీర్‌గాళ్స్‌ జోష్‌ ఏవీ లేకుండా సైలెంట్‌ మోడ్‌లో సాగిపోనుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో బయో సెక్యూర్‌ వాతావరణంలో తొలిసారి ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్‌ 2020 నిర్వహిస్తున్నారు. 53 రోజులపాటు 60మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ఎడిషన్‌లో మొత్తం 8 జట్లు టైటిల్‌ కోసం తలపడనున్నాయి. మొత్తం మూడు వేదికలుగా దుబాయ్‌, షార్జా, అబుదాబిలోనే మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌ రూపురేఖలను కరోనా పూర్తిగా మార్చివేసింది. మరోవైపు ఇప్పటికే చాలామంది క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు.. అయితే ఇంకా కరోనా భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. అందుకే క్రికెటర్లు బయట పీపీఈ కిట్లతో కనిపిస్తున్నారు.

ప్రస్తతం నాలుగు ఐపీఎల్ టైటిళ్లతో ముంబై అగ్రస్థానంలో ఉండగా.. సీఎక్కే మూడు సార్లు చాంపియన్‌గా నిలిచింది. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ భీకర జట్టుగా మారింది. ఆరంభ సీజన్లలో కెప్టెన్సీ చేయకున్నా.. అనంతరం కాలంలోనే ముంబై పగ్గాలు అందుకుని జట్టును విజయపథంలో నడిపించిన ఘనత రోహిత్ శర్మ సొంతం. ఐపీఎల్ తొలి సీజన్ నుంచే చెన్నై జట్టు ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారింది. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీనే ఇందుకు కారణం. రికార్డు స్థాయిలో 8 పైనల్స్ ఆడి 3 ఐపీఎల్ టైటిల్స్ నెగ్గింది సీఎస్కే. నిషేధం కారణంగా 2016, 2017 సీజన్లలో దూరంగా ఉండగా ఆ తర్వాత బరిలోకి దిగి మునుపటిలా దూసుకెళ్తోంది చెన్నై. ఈ సారీ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌ బై చెప్పిన తరువాత ధోనీ బరిలో దిగుతుండడంతో అతడిపై అందరి దృష్టి పడింది.

Tags

Next Story