ఐపీఎల్‌లో కింగ్స్ పంజాబ్ జైత్రయాత్ర..

ఐపీఎల్ లో కింగ్స్ పంజాబ్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా ముందుగా బ్యాటింగ్ చేసి 150 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో కేఎల్ రాహుల్, మన్‌దీప్ సింగ్, గేల్ ఆకట్టుకున్నారు. కింగ్స్ 47 పరుగుల వద్ద వరుణ్ చక్రవర్తి వేసిన 8వ ఓవర్ ఆఖరి బంతికి రాహుల్ ఔటయ్యాడు. ఆ తర్వాత మన్‌దీప్ సింగ్, క్రిస్ గేల్‌లు మరో వికెట్ పడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. క్రిస్ గేల్ 25 బంతుల్లో 5 సిక్స్‌లు, 2 ఫోర్లతో హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ తొలుత ఫీల్డింగ్ తీసుకోవడంతో కేకేఆర్ బ్యాటింగ్‌కు దిగింది. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో షమీ మూడు వికెట్లు సాధించగా, రవి బిష్నోయ్, క్రిస్ జోర్డాన్ చెరో రెండు వికెట్లు తీశారు. మురుగన్ అశ్విన్, మ్యాక్స్‌వెల్‌లు తలో వికెట్ తీశారు. ఇది కింగ్స్ పంజాబ్‌కు ఆరో విజయం కాగా, కేకేఆర్‌కు ఇది ఆరో ఓటమి. ఈ మ్యాచ్‌లో విజయం తర్వాత కింగ్స్ పంజాబ్ నాల్గో స్థానానికి చేరింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com