సీఎస్‌కే చేతిలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమి.. కారణాలు చూస్తే..

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమి చవి చూసింది. దీంతో ప్లేఆప్స్ చేరే అవకాశాలను చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై.. కోల్‌కతాను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నితీశ్ రాణా రాణించినప్పటికీ మరో ఎండ్‌లో ఎవరూ అతడికి సపోర్ట్‌గా నిలవలేదు. దీంతో 20 ఓవర్లలో కోల్‌కతా 172 రన్స్ మాత్రమే చేయగలిగింది. లక్ష్య చేధనలో చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభం నుంచి బాగా ఆడింది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నైను లక్ష్య చేధన దిశగా నడిపాడు. చివర్లో రవీంద్ర జడేజా సిక్సర్లతో చెన్నైను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమికి కారణాలేంటో చూద్దాం..
ఈ సీజన్లో తొలిసారిగా కోల్‌కతాకు ఓపెనర్లిద్దరూ శుభారంభం ఇచ్చారు. గిల్, రాణా ఆరు ఓవర్లలో 48 రన్స్ జోడించారు. కానీ మధ్య ఓవర్లలో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ స్లోగా బ్యాటింగ్ చేశారు. 9 ఓవర్లలో 58 రన్స్ మాత్రమే చేయగలిగారు. దీంతో చివర్లో దినేశ్ కార్తీక్ మెరుపులు మెరిపించినప్పటికీ.. కోల్‌కతా 172 రన్స్ మాత్రమే చేయగలిగింది. మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని నైట్ రైడర్స్ మరిన్ని పరుగులు చేయాల్సింది.
కోల్‌కతా పవర్ ప్లేలో ఏకంగా ఐదుగురు బౌలర్లను ప్రయోగించింది. చెన్సై బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడకుండా నియంత్రించడానికి కోల్‌కతా బౌలర్లు ఆరంభంలో ప్రయత్నించారు. కానీ వికెట్లను తీయడంపై దృష్టి సారించలేదు. దీంతో ఆ తర్వాత మంచు ప్రభావం మొదలై.. బ్యాట్స్‌మెన్‌కు కలిసొచ్చింది. గత 8 మ్యాచ్‌ల్లో ఏడింట్లో కోల్‌కతా పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోయింది.
జట్టులో ఐదుగురు ప్రత్యేక బౌలర్లు ఉన్నప్పటికీ.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పార్ట్ టైం ఆఫ్ స్పిన్నర్ నితీశ్ రాణాతో బౌలింగ్ చేయించాడు. రాణాతో బౌలింగ్ చేయించే అవరమే లేకున్నా.. మోర్గాన్ నిర్ణయం ఆశ్చర్యపరిచింది. ఆ ఓవర్లో రాణా 16 పరుగులు ఇచ్చుకోవడంతో.. మ్యాచ్‌లో చెన్నై బ్యాట్స్‌మెన్ మెల్లగా పుంజుకున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com