ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్య విజయం
రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్య విజయం సాధించింది.. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది..రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్య విజయం సాధించింది.. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది.. ఆల్ రౌండర్ స్టాయినీష్ 21 బంతుల్లో ఏడు ఫోర్లు, మడు సిక్సర్లతో 53 పరుగులు చేయగా.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 32 బంతుల్లో మూడు సిక్సర్లతో 39 పరుగులు చేశారు.. రిషబ్ పంత్ రాణించినప్పటికీ టాపార్డర్ సహా మిగతా బ్యాట్స్‌మెన్ అంతా ఘోరంగా విఫలమయ్యారు.. కీలక ప్లేయర్లంతా ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పడుతుండటంతో స్కోరు 130 కూడా దాటదని అంతా భావించారు.. కీలక సమయంలో స్ఠాయినీష్ విరుచుకుపడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.. స్టాయినీష్ వచ్చే వరకు నిదానంగా సాగిన స్కోరు.. అతని మెరుపులతో 157 పరుగుల వరకు తీసుకెళ్లాడు. పదునైన బౌలింగ్‌తో షమీ ఢిల్లీని కట్టడి చేసేందుకు గట్టిగానే ప్రయత్నించాడు.
ఇక 158 పరుగుల బరిలోకి దిగిన పంజాబ్ ఆరంభంలో తడబడినప్పటికీ చివర్లలో పుంజుకుని విజయం దిశగా వెళ్లింది.. చివరి ఓవర్‌లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా, హాఫ్ సెంచరీ చేసిన మయాంక్ అగర్వాల్ చివరి వరకు పోరాడాడు. 60 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేశాడు. చివర్లలో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.. చివరి బంతికి ఒక పరుగు చేయాల్సి ఉండగా, రబడాకు క్యాచ్ ఇచ్చి జోర్డాన్ ఔటయ్యాడు.. దీంతో మ్యాచ్ టై అయింది.. అప్పటి వరకు పంజాబ్ విజయం ఖాయమనుకున్న ఫ్యాన్స్ అంతా మ్యాచ్ టై కావడంతో ఉసూరుమన్నారు.. ఇక సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ రెండు పరుగులే చేసింది.. రబాడ వేసిన తొలి బంతికి రెండు పరుగులు రాగా, రెండో బంతికి కేఎల్ రాహుల్, మూడో బంతికి పూరన్ ఔట్ అయ్యారు.. దీంతో మ్యాచ్ ఢిల్లీకి అనుకూలంగా మారింది.. 3 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ అలవోకగా ఛేదించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ రెండు పరుగులు చేసి లాంఛనం పూర్తిచేశారు.. దీంతో రెండో మ్యాచ్‌లో ఢిల్లీ విజేతగా నిలిచింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com