మరోసారి రెచ్చిపోయిన రోహిత్ శర్మ

అబుదాబి వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఘన విజయం సాధించింది. 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ 8 వికెట్లు కోల్పోయి 143 రన్స్ మాత్రమే చేసింది. దీంతో రోహిత్‌సేన 48 పరుగుల తేడాతో ఈ సీజన్‌లో రెండో విజయం నమోదు చేసింది. మొదటి నుంచి ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పంజాబ్ ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరుకునేలా కనిపించలేదు. మొదట్లో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ తొలి వికెట్‌కు 38 పరుగులు జోడించి ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ ఔటయ్యాక పంజాబ్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ బాటపట్టారు. చివర్లో కృష్ణప్ప గౌతమ్ కాస్త అలరించడంతో పంజాబ్ స్కోర్ 143కి చేరింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ 45 బంతుల్లోనే 70 రన్స్‌తో రెచ్చిపోయాడు. చివర్లో కీరన్ పొలార్డ్ , హార్దిక్ పాండ్య మెరుపు బ్యాటింగ్ చేసి బౌండరీల వర్షం కురిపించారు. పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. వీరిద్దరూ 23 బంతుల్లో 67 పరుగులు చేయడం గమనార్హం.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com