ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన కోహ్లి, డివిలియర్స్‌

ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన కోహ్లి, డివిలియర్స్‌
కోహ్లి, డివిలియర్స్‌లు త‌మ ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఐపీఎల్-13 సీజన్‌లో భాగంగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా బెంగళూరు, హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ టాస్ గెలిచింది. ఆర్‌సీబీకి విరాట్ కోహ్లీ, ఎస్ఆర్‌హెచ్‌కు డేవిడ్ వార్నర్ సారథ్యం వహిస్తుండటంతో ఈ రెండు జట్లు మోస్ట్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగాయి. తొలుత టాస్ గెలిచిన సన్ రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

బెంగళూరు జట్టులో ఫించ్, దేవ్‌దత్ పడక్కల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిల్లీర్స్, జోష్ ఫిలిప్పె(వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీ, డేల్ స్టెయిన్, చాహల్ ఉన్నారు.

ఇకసన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో వార్నర్‌ (కెప్టెన్‌), బెయిర్‌ స్టో(వికెట్ కీపర్), మనీశ్ పాండే‌, విజయ్ శంకర్, మిచ్చెల్ మార్ష్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, టి నటరాజన్ ఉన్నారు.

అయితే ఈ మ్యాచ్‌లో కరోనా వారియర్స్ కు ఘనమైన నివాళులు అర్పించాల‌ని ఆర్‌సీబీ యోచిస్తుంది. ఇందులో భాగంగా తమ జెర్సీపై 'మై కోవిడ్‌ హీరోస్‌' అని ముద్రించింది. ఇక బెంగళూరు టీమ్ ధరించిన ఈ జెర్సీలను వేలం వేసి వాటి ద్వారా వచ్చే నగదు మొత్తాన్ని గివ్‌ ఇండియా ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వనున్నారు.

ఇక కోహ్లి, డివిలియర్స్‌లు త‌మ ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. వీరిద్ద‌రూ.. తమ సోషల్‌ మీడియాలో అకౌంట్ల పేర్లను మార్చేశారు. కోహ్లి తన ట్వీటర్‌ అకౌంట్‌ లో పేరును 'సిమ్రాన్‌జీత్‌ సింగ్‌' అంటూ మార్చుకున్నాడు.

ఇక డివిలియర్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు 'పారితోష్‌ పంత్‌' అంటూ మార్చుకున్నాడు. అలాగే పారితోష్‌ పంత్‌-17 జెర్సీతో డివిలియర్స్‌ కనిపిస్తున్నాడు. సిమ్రాన్‌జీత్‌ సింగ్‌-18 జెర్సీతో కోహ్లి కనిపిస్తున్నాడు. పారితోష్‌ పంత్ లాక్ డౌన్ స‌మ‌యంలో ఎంతోమంది పేద ప్రజలకు స‌హాయం చేశారు.

Tags

Next Story