IPL క్రికెటర్ల వేలానికి జాబితా రెడీ.. లిస్టులో సచిన్ టెండూల్కర్ కుమారుడు పేరు..

IPL క్రికెటర్ల వేలానికి జాబితా రెడీ.. లిస్టులో సచిన్ టెండూల్కర్ కుమారుడు పేరు..
IPL క్రికెటర్ల లిస్ట్ రెడీ అయింది. 292 మంది ఆటగాళ్లతో కుదించిన ఫైనల్ లిస్ట్‌ను BCCI ప్రకటించింది.

IPL క్రికెటర్ల లిస్ట్ రెడీ అయింది. 292 మంది ఆటగాళ్లతో కుదించిన ఫైనల్ లిస్ట్‌ను BCCI ప్రకటించింది. ఇందులో 164 మంది భారత క్రికెటర్లే ఉన్నారు. మొత్తం ఒక వేయి 114 మంది క్రికెటర్లు ఈ సీజన్‌లో ఆడేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారిలో 292 మందిని BCCI ఎంపిక చేసింది. ఇక లిస్టులో క్రికెట్ దిగ్గజనం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పేరు కూడా ఉంది. IPL 2021 వేలం ఈ నెల 18న చెన్నైలో జరగనుంది. ఈ సీజన్‌లో 61 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా బెంగళూరు జట్టులో 13 ఖాళీలు, హైదరాబాద్ జట్టులో 3 ఖాళీలున్నాయి.

ఇప్పుడు అందరి దృష్టి ఏయే క్రీడాకారులకు డిమాండ్‌ ఉంటుందనే అంశంపైనే ఉంది. కనీస ధర 2 కోట్ల లిస్టులో హర్భజన్ సింగ్‌, కేదార్‌ జాదవ్, ఆస్ట్రేలియా స్టార్లు స్టీవ్‌స్మిత్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఉన్నారు. ఇక అర్జున్ టెండూల్కర్ తన కనీస ధర 20 లక్షలుగా నమోదు చేశాడు. అయితే అతడిని ఎవరు కొనుగోలు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత నెల కొంతమంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలేశాయి. మరిప్పుడు వారిని ఏయే జట్లు కొనుగోలు చేస్తాయనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story