IPL Updates: గైక్వాడ్ సెంచరీ.. ఆట గెలవకపోయినా మనసు గెలుచుకున్నాడు..

IPL Updates: ఐపీఎల్ మ్యాచ్‌లు రోజురోజుకు ఊహించని మలుపు తీసుకుంటున్నాయి. లాస్ట్ ఓవర్ వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. ఇది మామూలుగా ప్రతీ మ్యాచ్‌లో ఉండేదే అయినా ఈసారి పెద్ద టీమ్‌ల పై చిన్న టీమ్‌లు ఆధిక్యాన్ని చూపిస్తున్నాయి. నిన్న జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) రాజస్థాన్ రాయల్స్(ఆర్‌ఆర్)కు మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 7 వికెట్ల పరుగుల తేడాతో గెలిచింది.
చెన్నై 190 టార్గెట్‌ను పెట్టిన తర్వాత కూడా రాజస్థాన్ ఆటగాళ్లు ఆ స్కోర్‌ను ఈజీగా రీచ్ అయ్యారు. 17 ఓవర్ల 3 బంతుల్లోనే వారు మ్యాచ్‌ను ముగించేసారు కూడా. రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, శివమ్ దూబె చెరొక హాఫ్ సెంచరీ చేసారు. ఇక చెన్నై ఓపెనర్ రూతురాత్ గైక్వాడ్ తన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాజస్థాన్‌కు అంత గట్టి పోటీ ఇచ్చే స్కోర్‌ను సాధించడంలో గైక్వాడ్ కీ రోల్ ప్లే చేసాడు.
60 బంతుల్లో 101 పరుగులు తీసిన గైక్వాడ్‌క చివరి ఓవర్‌లో రవీంద్ర జడేజా తోడయ్యాడు. 15 బంతుల్లో 32 రన్స్ కొట్టిన జడేజా వరుసగా ఒకే ఓవర్‌లో 4,4,6 పరుగులు తీసి శభాష్ అనిపించుకున్నాడు. ఇక సురేశ్ రైనా, అంబటి రాయుడు లాంటి సీనియర్ ఆటగాళ్లు నిన్న వారి ఆటతో ఆడియన్స్‌ను నిరాశపరిచారు.
ఇప్పటికే సీఎస్‌కే టేబుల్ టాప్‌లో ఉండడంతో ప్లే ఆఫ్స్‌లో వారి ప్లేస్‌కు ఏ డోకా లేదు. ఇక రాజస్థాన్ రాయల్స్ కూడా ఇదే ఫార్మను కొనసాగిస్తే వారికి ప్లే ఆఫ్స్ సీట్ ఖాయం అనుకుంటున్నారంతా. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com