IPL 2022 prize money : ఎవరెవరికి ఎంతెంత ప్రైజ్ మనీ అంటే?

IPL 2022 prize money :  ఎవరెవరికి  ఎంతెంత  ప్రైజ్ మనీ అంటే?
X
IPL 2022 prize money : : రాజస్థాన్ రాయల్స్‌ను ఏకపక్షంగా 7 వికెట్ల తేడాతో ఓడించి గుజరాత్ టైటాన్స్ IPL 2022 టైటిల్‌ను గెలుచుకుంది.

IPL 2022 prize money : : రాజస్థాన్ రాయల్స్‌ను ఏకపక్షంగా 7 వికెట్ల తేడాతో ఓడించి గుజరాత్ టైటాన్స్ IPL 2022 టైటిల్‌ను గెలుచుకుంది. ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్‌ తరఫున కెప్టెన్ హార్దిక్ పాండ్యా అటు బంతితో, ఇటు బ్యాటింగ్‌తో అద్భుతమైన ఆటతీరును కనబరిచి జట్టుకు టైటిల్ అందిచడంలో కీ రోల్ ప్లే చేశాడు. దీనితో గుజరాత్ టైటాన్స్ కి ట్రోఫీతో పాటుగా బీసీసీఐ నుంచి రూ. 20 కోట్ల ప్రైజ్ మనీ కూడా అందుకుంది. అటు రన్నరప్ గా నిలిచిన రాజస్థాన్ కి రూ.13 కోట్లు, మూడో స్థానంలో నిలిచిన బెంగుళూరుకి రూ. 7కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన లక్నోకి రూ. 6.5 కోట్లు దక్కాయి. ఇక టోర్నీలో అత్యధిక రన్స్ చేసిన బట్లర్ (863) కు రూ. 15 లక్షలు, అత్యధిక వికెట్లు తీసిన చాహల్ కి రూ. 15 లక్షలు అందుకున్నారు.

2008-2022: IPL ఛాంపియన్ల జాబితా

  • 2008: రాజస్థాన్ రాయల్స్ (చెన్నైని 3 వికెట్ల తేడాతో ఓడించింది)
  • 2009: డెక్కన్ ఛార్జర్స్ (బెంగళూరును 6 పరుగుల తేడాతో ఓడించింది)
  • 2010: చెన్నై సూపర్ కింగ్స్ (ముంబైని 22 పరుగులతో ఓడించింది)
  • 2011: చెన్నై సూపర్ కింగ్స్ (58 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది)
  • 2012: కోల్‌కతా నైట్ రైడర్స్ (చెన్నైని 5 వికెట్ల తేడాతో ఓడించింది)
  • 2013: ముంబై ఇండియన్స్ (23 పరుగుల తేడాతో చెన్నైని ఓడించింది)
  • 2014: కోల్‌కతా నైట్ రైడర్స్ (పంజాబ్‌పై 3 వికెట్ల తేడాతో విజయం)
  • 2015: ముంబై ఇండియన్స్ (41 పరుగుల తేడాతో చెన్నైని ఓడించింది)
  • 2016: సన్‌రైజర్స్ హైదరాబాద్ (బెంగళూరుపై 8 పరుగుల తేడాతో విజయం)
  • 2017: ముంబై ఇండియన్స్ (1 పరుగుతో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్‌ను ఓడించింది)
  • 2018 : చెన్నై సూపర్ కింగ్స్ (8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది)
  • 2019: ముంబై ఇండియన్స్ (1 పరుగుతో చెన్నైపై విజయం)
  • 2020: ముంబై ఇండియన్స్ (ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం)
  • 2021: చెన్నై సూపర్ కింగ్స్ (27 పరుగుల తేడాతో కోల్‌కతాను ఓడించింది)
  • 2022: గుజరాత్ టైటాన్స్ (రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం)

Tags

Next Story